పెళ్లిసందడి చేస్తోన్న బుజ్జిగాడి లవర్  

Malavika Nair Roped In For Pelli Sandadi, Malavika Nair, Pelli SandaD, Raghavendra Rao, Roshan, Srikanth, Pelli Sandadi - Telugu Malavika Nair, Pelli Sandad, Pelli Sandadi, Raghavendra Rao, Roshan, Srikanth

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ‘పెళ్లిసందడి’ 90లలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

TeluguStop.com - Malavika Nair Roped In For Pelli Sandadi

ఈ సినిమాతో హీరో శ్రీకాంత్ ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.ఇప్పుడు ఇదే టైటిల్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాఘవేంద్ర రావు రెడీ అవుతున్నాడు.

ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా ఆయన అనౌన్స్ కూడా చేశారు.అయితే ఈ సినిమాకు ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నట్లు తెలుస్తోంది.

TeluguStop.com - పెళ్లిసందడి చేస్తోన్న బుజ్జిగాడి లవర్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ కొడుకు రోషన్‌ను తీసుకున్నారు చిత్ర యూనిట్.

ఇటీవల ఈ సినిమాలో రోషన్ నటిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ కన్ఫం చేయగా, తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా ఓ క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ మాళవికా నాయర్‌ను ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఇటీవల ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రంతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు పెళ్లిసందడి సీక్వెల్ చిత్రంలో హీరోయిన్‌గా సెలెక్ట్ కావడంతో ఆమె కెరీర్‌కు ఇది ఖచ్చితంగా బూస్ట్ ఇస్తుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాకు గౌరి రొనంకి అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం చేస్తుండగా, ఆర్కే ఫిలింస్ మరియు ఆర్కా మీడియా సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాయి.

పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.ఈ సినిమాతో రోషన్‌కు హీరోగా అదిరిపోయే గుర్తింపుతో పాటు అదిరిపోయే సక్సెస్ కూడా లభిస్తుందో లేదో చూడాలి.

ఏదేమైనా పెళ్లిసందడి లాంటి క్లాసిక్ చిత్రాన్ని రీమేక్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

#Raghavendra Rao #Roshan #Pelli SandaD #Pelli Sandadi #Srikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Malavika Nair Roped In For Pelli Sandadi Related Telugu News,Photos/Pics,Images..