తనపై వచ్చిన ట్రోల్స్ ని ఎంజాయ్ చేసిన హీరోయిన్

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి.నెటిజన్లు రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటారు.

 Malavika Mohanan Reacts On Trolls On Her Expressions, Tollywood, Kollywood, Mast-TeluguStop.com

సొసైటీలో జరిగే విషయాల మీద సెటైరికల్ గా స్పందిస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తారు.వీటిని చాలా మంది చూసి ఎంజాయ్ చేస్తారు.

కొంతమంది వాటిని షేర్ చేస్తూ ఉంటారు.ఇలా సోషల్ మీడియాలో సెలబ్రెటీల మీద కూడా మీమ్స్ రూపంలో ట్రోల్స్ వస్తూ ఉంటాయి.

వారు నటించే సినిమాల విషయంలో ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే ఈ ట్రోల్స్ విమర్శనాత్మకంగా ఉన్నంత వరకు సెలబ్రెటీలు బాగానే రిసీవ్ చేసుకుంటారు.

అయితే శృతి మించితే మాత్రం వారు కూడా తిరిగి స్ట్రాంగ్ రిప్లై ఇస్తారు.ట్రోల్స్ చేస్తున్నవారిపై విమర్శలు చేస్తారు.

కొందరు సెలబ్రెటీలు మాత్రం తమపై ఎలాంటి ట్రోల్స్ వచ్చిన ముందుగానే సిద్ధమైపోయి వాటిని స్పోర్టివ్ గా తీసుకుంటారు.ఇప్పుడు తనపై వచ్చిన ట్రోల్స్ విషయంలో కూడా మాస్టర్ హీరోయిన్ మాళవిక మోహనన్ అలాగే రియాక్ట్ అయ్యింది.

ఈ సినిమాలో మాలవికా చేసిన క్యారెక్టర్ పై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.పెద్దగా ప్రాధాన్యత లేని క్యారెక్టర్ ను మాలవికా సెలక్ట్ చేసుకుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

అంతేకాదు సోషల్ మీడియాలో ఆమె పాత్ర చుట్టూ ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.ఈ విషయాన్ని గుర్తించిన మాళవికా వాటిపై స్పందించింది.ఈ మీమ్స్ చాలా హిలేరియస్ గా ఉన్నాయి.వీటిని చూసి నవ్వుతూనే ఉన్నాను.

ముఖ్యంగా టూత్పేస్ట్ తో తయారు చేసిన మీమ్ చూసి నవ్వలేక చచ్చాను.అయినా నవ్వకపోతే జీవితమే బోర్ కదా అంటూ ట్వీట్ చేసింది.

ఆమె తనపై వచ్చిన మీమ్స్ పై స్పందించిన విధానం చూసి అభిమానులు ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube