మాళవిక మోహనన్ ధరించిన ఈ డ్రెస్ ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే?

హిందీ, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలలో నటించి మాళవిక మోహనన్ ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీకి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Malavika Mohanan Blush Pink Gulab Advaita Lehenga Price 2lakhs, Malavika Mohanan-TeluguStop.com

సోషల్ మీడియా ద్వారా ఈ బ్యూటీ సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు.

అయితే తెలుగులో మాత్రం ఈ బ్యూటీకి భారీస్థాయిలో పాపులారిటీ లేదు.

ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ కు ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్లలో మాళవిక మోహనన్ కూడా ఒకరు.తాజాగా మాళవిక దిగిన ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఆ ఫోటోలో మాళవిక ధరించిన డ్రెస్ ఖరీదు ఏకంగా 1,62,000 రూపాయలు కావడం గమనార్హం.మాళవిక మోహనన్ తన దుస్తుల గురించి మాట్లాడుతూ దుస్తులపై తాను పెద్దగా దృష్టి పెట్టనని తెలిపారు.

Telugu Dhanush, Maaran, Malavikamohanan, Master-Movie

జ్యూయలరీని తాను ఎంతగానో ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చారు. బోల్డ్ ఇయర్ రింగ్స్ తన ఫేవరెట్ అని ఈ బ్యూటీ కామెంట్లు చేశారు.వైరల్ అవుతున్న ఫోటోలో మాళవిక మోహనన్ చాలా అందంగా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.కరణ్ తోహారీ డిజైన్ చేసిన డ్రెస్ లో మాళవిక మోహనన్ మెరిసిపోతున్నారు.

మాళవిక మారన్ అనే సినిమాలో నటించగా త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Telugu Dhanush, Maaran, Malavikamohanan, Master-Movie

తమిళంలో స్టార్ హీరోలకు జోడీగా ఈ బ్యూటీ సినిమా ఆఫర్లను అందిపుచ్చుకోవడం గమనార్హం.సినిమా సినిమాకు మాళవిక మోహనన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.తెలుగులో కూడా ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా మాళవిక మోహనన్ ఈ స్టేటస్ ను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

కెరీర్ విషయంలో మాళవిక మోహనన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube