జ్యోతిక 'రాక్షసి' పై ప్రసంశలు కురిపించిన మలేషియా మంత్రి  

Malasiya Minister Praises Jyothika Movie-bollywood Movies,hollywood Movies,indian Movies,malasiya Instagram,malasiya Minister,tollywood Movies

ఇండియన్ సినిమాలు అనగానే ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఉండేవి.కానీ బాహుబలి తరువాత ఇండియన్ సినిమాలు అనగానే దక్షిణాది సినిమాలు కూడా తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Malasiya Minister Praises Jyothika Movie-Bollywood Movies Hollywood Indian Malasiya Instagram Tollywood

ప్రతి చిత్రం కూడా బాలీవుడ్ రేంజ్ ని మించి హాలీవుడ్ రేంజ్ కు చేరుకొనే పరిస్థితులు నెలకొంటున్నాయి.ఆ మధ్య షాంఘై ఫిల్మ్ ఫెస్టివల్ లో టాలీవుడ్ మూవీ మహానటి ప్రదర్శితమైన విషయం తెలిసిందే.

ఆ చిత్రానికి కూడా పలువురు ప్రసంశలు కురిపించారు.అయితే ఇప్పుడు తాజా గా ప్రముఖ నటి జ్యోతిక నటించి మెప్పించిన చిత్రం ‘రాక్షసి’.

Malasiya Minister Praises Jyothika Movie-Bollywood Movies Hollywood Indian Malasiya Instagram Tollywood

ఈ చిత్రానికి పలువురు ప్రశంసల వర్షం కురిపించారు.అయితే మలేషియా విద్యాశాఖ మంత్రి కూడా జ్యోతిక నటించిన రాక్షసి సినిమా పై ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందించారు.

ఈ చిత్రం రీసెంట్ గా చూశాను చాలా బాగుంది అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

నటి జ్యోతిక నట జీవితం వివాహానంతరం కూడా అప్రతిహతంగా కొనసాగుతోంది.ఇటీవల జ్యోతిక లీడ్ రోల్‌లో నటించిన ‘రాక్షసి’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

కథ, కథనాలు, నటన అద్భుతంగా ఉండటంతో సినిమాను జనాలు బాగా ఆదరించారు కూడా.ఈ చిత్రంలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలి పాత్రలో తన అద్భుత నటనతో అలరించి విమర్శకుల ప్రసంశలు కూడా అందుకుంది.


అయితే ఈ సినిమాను చూసిన మలేషియా మంత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిప్రాయాలను పోస్ట్‌ చేస్తూ… ‘రెండు నెలల క్రితం ఈ సినిమా విడుదలైంది.రీసెంట్‌గా ఈ సినిమాను అధికారులతో కలిసి చూశాను.

స్వయంగా ఈ సినిమా రివ్యూ రాయాలని నిర్ణయించుకున్నా.ఇది అందరూ చూడాల్సిన సినిమా.కథ అద్భుతంగా ఉందంటూ పోస్ట్ చేశారు.

.

తాజా వార్తలు