ఏ మాలను ధరిస్తే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఋషులు, మునులు, పురోహితులను చూసినప్పుడు వారి మెడలో మనకు వివిధ రకాల మాలలు కనిపిస్తాయి.ఈ మాలలు పవిత్రమైన ఔషధ మొక్కలు, విత్తనాలు బెరడు నుంచి తయారు చేస్తారు.

 Malanu Daristhe Elanti Phalithalu Untayee, Rudrakshamala, Vishnumurti, Pooja, Kr-TeluguStop.com

ఈ మాల లను ఉపయోగించి మంత్రాలను లెక్క పెడతారు, జపాలను చేస్తుంటారు.ఈ విధంగా మాలలో ఎన్నో రకాలు ఉంటాయి.

ఈ క్రమంలోనే ఏ విధమైన మాలలను ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

కమలాక్ష మాలను ధరించడం వల్ల శత్రువుల నుంచి విజయం సాధించవచ్చు.

ముడులతో కూడిన మాలలను ధరించడం వల్ల పాప విముక్తి కలుగుతుంది.జీవ పుత్ర మాలలను సంతాన గోపాలుడి రక్షణ రేకులతో ధరించడం వల్ల పుత్రసంతానం కలుగుతుందని భావిస్తారు.

సంపద కలగాలంటే కెంపుల మాల ధరించాలి.రుద్రాక్షమాలను ధరించి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే వివిధ రకాల వ్యాధులు తొలగిపోయే మరణ గండం నుంచి బయటపడతారు.

హరిద్ర మాల ధరించడం వల్ల మనం చేసే కార్యాలయాలు అడ్డంకులు తొలగిపోయి, శత్రువుల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి.కృష్ణుడు ,విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలంటే గవ్వలు ఉన్న మాలను ధరించాలి.

ఇతరుల దృష్టి లోపం నుంచి మన పిల్లలను రక్షించుకోవాలంటే పులిగోరు మాల ధరించాలి.ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో విశ్వాసంతో మాలలను ధరిస్తూ ఉంటారు.

అయితే ఈ మాలలను ధరించే టప్పుడు తప్పకుండా నియమ నిష్టలు పాటించాలి.ముఖ్యంగా ఆహార విషయంలోనూ, బ్రహ్మచర్యంలోనూ నిష్టతో కఠిన నియమాలను పాటించినప్పుడే ఈ మాల వల్ల ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ నియమాలు పాటించ లేదంటే ప్రయోజనాల కన్నా అధిక సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube