భారత్ లో ఇతర ప్రాంతాల ప్రజలకు ప్రవేశం లేని వింత గ్రామమిదే?  

Malana Village outsiders from other villages are not allowed, Malana Village,India. Rules in Malana Village, Malana Village Rules - Telugu Himachal Pradesh, India, India. Rules In Malana Village, Malana Village, Malana Village Outsiders From Other Villages Are Not Allowed, Malana Village Rules

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి.భిన్నత్వంలో ఏకత్వానికి ప్రాధాన్యతనిచ్చే దేశం మనది.

 Malana Village Outsiders Not Allowed

మన దేశంలో ఒక ప్రాంతంలోని వాళ్లు మరో ప్రాంతంలోకి వెళ్లడంపై నిషేధం లేదు.అయితే ఒక్క గ్రామం మాత్రం ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లను గ్రామంలోకి అనుమతించదు.

హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో ఉన్న మలానా గ్రామం ప్రపంచమంతా ఒకవైపు నడిస్తే మరోవైపు నడుస్తోంది.

భారత్ లో ఇతర ప్రాంతాల ప్రజలకు ప్రవేశం లేని వింత గ్రామమిదే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ గ్రామంలోని వాసులు గ్రామాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.

ఈ గ్రామంలో పాలనా వ్యవహారాలను గ్రామ కౌన్సిల్ లో ఉండే 11 మంది సభ్యులు పర్యవేక్షిస్తారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో మలానాకు ఎటువంటి సంబంధం ఉండదు.

ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మినహా ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి కార్యాలయాలు ఉండవు.వీళ్లు ఆ గ్రామంలోని వ్యక్తులను మాత్రమే వివాహం చేసుకుంటారు.

ఇక్కడ ఏ రోజున పుడితే ఆ రోజు పేరే పెడతారు.కనషీ భాషను ఇక్కడి ప్రజలు ఎక్కువగా మాట్లాడతారు.ఈ గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లను శత్రువులుగా చూస్తారు.ఈ గ్రామాన్ని కొందరు ద రిపబ్లిక్ ఆఫ్ మలానా అని పిలుస్తారంటే ఈ ప్రాంతం గొప్పతనం సులువుగానే అర్థమవుతుంది.

ఈ గ్రామంలోని లోయలో మహిమాన్వితమైన ఔషధాలు ఉన్నాయని సమాచారం.

కాలం మారుతున్నా మలానా ప్రజల ఆలోచనా తీరులో మాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.

హైడ్రో పవర్ స్టేషన్ అందుబాటులో ఉండటం వల్ల వీళ్లకు విద్యుత్ సమస్య ఉండదు.ఇక్కడి ప్రజలు బయటి ప్రపంచానికి దూరంగా జీవనం సాగిస్తూ ఉంటారు.మలానా గ్రామస్థులు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326వ సంవత్సరంలో ఈ ప్రాంతానికి వచ్చాడని… ఆ సమయంలో కొంతమంది సైనికులను ఇక్కడ వదిలివెళ్లాడని… వాళ్లే తమ పూర్వీకులని చెబుతూ ఉంటారు.ఇతరులను తమ ప్రాంతంలోకి అనుమతిస్తే త‌మ జాతి క‌లుషితం అవుతుంద‌ని మ‌లానా గ్రామ‌స్థులు భావిస్తున్నారు.

#India #MalanaVillage #MalanaVillage #India.Rules #Malana Village

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Malana Village Outsiders Not Allowed Related Telugu News,Photos/Pics,Images..