మళ్ళీ అతనితో డేటింగ్ చేస్తున్న మలైకా.. ఈసారి పెళ్లి వైపు అడుగులు?

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి మలైకా అరోరా గురించి అందరికీ పరిచయమే.తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Malaika Is Dating With Him Again Steps Towards Marriage This Time-TeluguStop.com

నటిగానే కాకుండా డాన్సర్, మోడల్ గా కూడా పేరు సంపాందించుకుంది.అంతేకాకుండా టీవీ వ్యాఖ్యతగా కూడా చేసింది.

టాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది.టాలీవుడ్ స్టార్ హీరోల సరసన స్పెషల్ సాంగ్ లలో నటించింది.

 Malaika Is Dating With Him Again Steps Towards Marriage This Time-మళ్ళీ అతనితో డేటింగ్ చేస్తున్న మలైకా.. ఈసారి పెళ్లి వైపు అడుగులు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గ్లామర్ విషయంలో ఎంతో మంది కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది.

ఇక మలైకా నటిగా కంటే వ్యక్తిగత విషయాలలో బాగా హాట్ టాపిక్ గా నిలిచేది.

ఇప్పటికే ఎన్నో వ్యాపారాల విషయంలో, వివాదాల విషయంలో బాగా విమర్శలు ఎదుర్కొంది.ఇక తనకంటే వయసులో చిన్న వాడితో రిలేషన్ లో ఉన్నా సంగతి తెలిసిందే.బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తో ప్రేమలో పడి అతనితో సహ జీవనం చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తుంది.

అర్జున్ కపూర్ తో కలిసి బాగా ట్రిప్స్ కూడా చేస్తుంది.

ఇక వీరిద్దరూ మీడియా కంటికి పడినా కూడా వీళ్ళు అస్సలు పట్టించుకోరు.తామేంటో ఎంజాయ్ ఏంటో అనేది మాత్రమే చూసుకుంటారు.

ఈమెకు అర్జున్ కపూర్ కంటే ముందు అర్బాజ్ ఖాన్ అనే వ్యాపారవేత్తతో పెళ్లి జరిగింది.వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

కాని అతడితో మనస్పర్థలు రావడంతో 2017లో విడిపోయింది.అర్బన్ ఖాన్ తో విడాకులు తీసుకున్న రెండు సంవత్సరాలకే అర్జున్ కపూర్ తో పరిచయం పెంచుకుంది.

Telugu Arbaaz Khan, Bollywood, Bollywood Actor Arjun Kapoor, Dating, Heroine, Malaika, Malaika Dating, Malaika Marriage, Malaika White Wedding Dress, Marrige-Movie

మొదట్లో వీరి మధ్య రిలేషన్ గురించి ఎవరు పట్టించుకోలేదు.కానీ వీరి మధ్య సన్నిహితం బాగా పెరగటంతో అందరికీ తెలిసిపోయింది.వయసులో చిన్నవాడితో ఇలా తిరుగుతుంది ఏంటి అని బాగా కామెంట్లు చేశారు.అయినా కూడా పట్టించుకోలేదు మలైకా.గతంలో వీరి మధ్య పెళ్లి గురించి కూడా బాగా చర్చలు వచ్చాయి.ఆ తర్వాత ఎటువంటి రిలేషన్ లేదని పుకార్లు వచ్చాయి.

ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ అతడితోనే డేటింగ్ చేస్తూ ఈసారి పెళ్లి వైపు అడుగులు వేస్తుంది.ఇంతకీ ఆమెకు పెళ్లి గురించి ఆలోచన రావడానికి కారణం ఏంటంటే.

తనకు భారతీయ పెళ్లి వస్త్రాలంకరణ అంటే ఎంతో ఇష్టమని అందులో తెల్లని పెళ్లి దుస్తులు అంటే తన మనసుని దోచుకుంటాయని తెలిపింది.

Telugu Arbaaz Khan, Bollywood, Bollywood Actor Arjun Kapoor, Dating, Heroine, Malaika, Malaika Dating, Malaika Marriage, Malaika White Wedding Dress, Marrige-Movie

తనకు ఇండియన్ స్టైల్ పెళ్లి దుస్తులు ఇష్టమని అవి ఎంతో సూపర్ అని ముఖ్యంగా వైట్ వెడ్డింగ్ డ్రెస్ తనకు ప్రాధాన్యతని తెలిపింది.

దీంతో ఈమె చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అందరిలో ఓ ప్రశ్న అయింది.మలైకా కు పెళ్లి దుస్తులపై ఆసక్తి కలిగిందంటే తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిందేమో అని అంటున్నారు.

ఎలాగో తను అర్జున్ కపూర్ తో డేటింగ్ లోనే ఉంది కదా పైగా గతంలో వీరిద్దరి పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు కదా బహుశా పెళ్లి దుస్తుల వల్ల అర్జున్ కపూర్ తో పెళ్లి అడుగులు వేస్తుందేమో అని కామెంట్లు పెడుతున్నారు.

#Arbaaz Khan #BollywoodArjun #Malaika #Malaika #Marrige

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube