స్విమ్మింగ్ ఫూల్ వద్ద బోల్డ్ గా ఫోజులిచ్చిన సీనియర్ హీరోయిన్... దాంతో అవసరమా అంటూ....

తెలుగులో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన “గబ్బర్ సింగ్” చిత్రంలోని కెవ్వు కేక పాట లో “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” సరసన  చిందులేసిన “బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మలైకా అరోరా 40 ఏళ్లు పైబడినప్పటికీ ఇప్పటికీ చాలా స్లిమ్ గా ఉంటూ ఫిట్నెస్  మెయింటేన్ చేస్తూ కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేస్తోంది.

 Malaika Arora Looks Stunning In Swimming Attire, Malaika Arora, Bollywood Actres-TeluguStop.com

 అయితే ఈ మధ్యకాలంలో మలైకా అరోరా సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది. ఈక్రమంలో అప్పుడప్పుడు యోగా మరియు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పలు సలహాలు, సూచనలు ఇస్తోంది.

అంతేగాక తన అందమైన ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది.

కాగా తాజాగా మలైకా అరోరా ఓ ప్రముఖ ఫోటోషూట్ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని అందాల ఆరబోతతో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

ఈ క్రమంలో స్విమ్మింగ్ పూల్ వద్ద  స్విమ్మింగ్ దుస్తులలో దిగినటువంటి ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.దీంతో కొందరు నెటిజన్లు మలైకా అరోరా అందాలకి ఫిదా అయ్యారు.

 అంతేగాక నాలుగు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ మలైకా అరోరా తన ఫిట్నెస్ మరియు గ్లామర్ ని కన్నెపిల్లలాగే మెయింటైన్ చేస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం ఈ వయసులో ఇలాంటి హాట్ హాట్ ఫోటోలకి ఫోజులు  ఇవ్వడం భవిష్యత్తులో తన పిల్లలు మరియు కుటుంభ సభ్యులు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ వయసులో ఇలాంటి ఫోజులు అవసరమా.? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎవరు ఏమన్నా మలైకా అరోరా ఖాన్ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతుంది.

కాగా ప్రస్తుతం మలైకా అరోరా అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 12 మిలియన్ల మందికి పైగా నెటిజన్లు ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో మలైకా అరోరా కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఏమిటో అని.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మలైకా అరోరా బాలీవుడ్ లోని పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటిస్తోంది.అంతేగాక ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి సోనీ ఛానల్ లో ప్రసారమయ్యే “ఇండియాస్ బెస్ట్ డాన్సర్” అనే  డాన్స్ షోకి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.

ఈ మధ్యనే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube