మలైకా అరోరా : అతడు వయసులో నా కంటే చిన్నవాడే కానీ.. ఆ విషయంలో మాత్రం...

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి గబ్బర్ సింగ్ అనే చిత్రంలో “కెవ్వు కేక” అంటూ స్టెప్పు లేసి కుర్రకారు గుండెల్లో హీట్ పెంచిన టువంటి ముంబై బ్యూటీ మలైకా అరోరా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఎక్కువగా తన సినిమాల కంటే కూడా ఈ మధ్య కాలంలో తన వ్యక్తిగత ప్రేమాయణాల గురించి  వార్తల్లో నిలుస్తోంది.

 Malaika Arora, Bollywood Actress, Arjun Kapoor, Bollywood Hero, Love Affair-TeluguStop.com

అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత కొడుకు అర్జున్ కపూర్ పుట్టినరోజు కావడంతో మలైకా అరోరా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.అంతటితో ఆగకుండా అర్జున్ కపూర్ తో ఉన్నటువంటి డేటింగ్ రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ అర్జున్ కపూర్ తన కంటే 11 సంవత్సరాలు చిన్నవాడైనప్పటికీ డేటింగ్ విషయంలో మాత్రం చాలా పరిపక్వత మనస్తత్వం ఉన్నవాడని అంటూ కామెంట్ చేసింది.

దీంతో పెళ్లి ఎప్పుడుచేసుకుంటారంటూ కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.అయితే ఈ ఇద్దరి మధ్య డేటింగ్ విషయ గురించి కథలు కథలుగా సోషియల్ మీడియాలో వినిపిస్తున్నప్పటికీ మలైకా మాత్రం అసలు పెళ్లి ఊసే  ఎత్తడం లేదు.

మరి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారో లేక చాల మంది  ప్రేమికుల లాగా పెళ్లి కాకుండా మిగిలిపోతారో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా మలైకా అరోరా తన భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ప్రస్తుతం ముంబైలో తన సొంత నివాసంలో పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది.

అలాగే పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తూ, స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube