ఈ ఐఏఎస్‌ మేడం గ్రేట్‌.. ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్‌, వెయ్యి మందికి ఆదర్శం  

ఐఏఎస్‌లు అంటే పరిపాలన కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంటారు. వారికి కనీసం కుటుంబంతో సమయం గడిపేందుకు కూడా వీలు ఉండదు. అంత బిజీ లైప్‌లో ఎప్పుడో ఒకసారి వీలు చిక్కినప్పుడు హాలీడే ట్రిప్స్‌ వేయాలని అనుకుంటారు. కాని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ మాలా శ్రీవాత్సవ గారు మాత్రం ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు పాఠాలు చెబుతూ, వారిని ఎడ్యుకేట్‌ చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. అప్పుడప్పుడు వెళ్లి వారికి ఏదైనా విషయంపై భోదించడం లేదంటే వారికి అవగాహణ కలిగించడం చేస్తూ ఉంటారు.

Mala Srivastava Takes Out Time To Teach In Govt Schools-Mala Ias Unknown Facts About Viral

Mala Srivastava Takes Out Time To Teach In Govt Schools

మాలా శ్రీవాత్సవ గారి దారిలో యూపికి చెందిన పలువురు యువ ప్రభుత్వ ఉద్యోగులు మరియు విద్యార్థిని విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలో భోదించేందుకు ముందుకు వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. కొన్ని వందల పాఠశాల్లో ఈ తరహా భోదన జరుగుతుంది. కంప్యూటర్‌ విద్యార్థులు మరియు ఇతర సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు ప్రభుత్వ పాఠశాల్లో తమ జ్ఞానంను పంచుతున్నారు. తాజాగా కూడా కొంత మంది మాలా శ్రీవాత్సవ గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి రోజు సాయంత్రం రెండు గంటల పాటు ప్రభుత్వ పాఠశాల్లో టీచింగ్‌కు ముందుకు వచ్చారు.

Mala Srivastava Takes Out Time To Teach In Govt Schools-Mala Ias Unknown Facts About Viral

తనను చూసి కనీసం పది మంది అయినా ప్రభుత్వ పాఠశాలపై దృష్టి పెట్టాలనేది మాలా శ్రీవాత్సవ గారి అభిమతం. కాని ఇప్పుడు ఆమెను ఇన్సిపిరేషన్‌గా తీసుకుని కొన్ని వందల మంది ప్రభుత్వ పాఠశాలల పిల్లల కోసం సమయం కేటాయిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులకు తోడుగా ఉండటంతో పాటు, వారికి సాయంగా పిల్లల అభ్యున్నతికి తోడ్పాటును అందించడం జరుగుతుందని ఈ సందర్బంగా యూపీ విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

Mala Srivastava Takes Out Time To Teach In Govt Schools-Mala Ias Unknown Facts About Viral

వాలింటీర్‌లుగా వస్తున్న వారి వల్ల విద్యార్థులు చాలా మంచి విషయాలు నేర్చుకుంటున్నారని, కొత్త విషయాలు నేర్చుకుని తమ జ్ఞానంను ప్రభుత్వ పాఠశాలల పిల్లలు పెంపొందించుకుంటున్నారు అంటూ ఈ సందర్బంగా పిల్లల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐఏఎస్‌ అయినా కూడా మాలా శ్రీవాత్సవ చూపించిన చొరవతో ప్రస్తుతం యూపీలోని బహరైచ్‌ చిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో మంది నాణ్యమైన విధ్యను పొందుతున్నారు. మాలా మేడం లాంటి వారు ఎంతో మందికి ఆదర్షంగా నిలుస్తున్నారు.