గాడిద పాల‌తో స‌బ్బుల త‌యారీ.. కోట్లు సంపాదిస్తున్న యువ‌కుడు

ఈ రోజుల్లో చిన్న చిన్న ఐడియాల‌తో కూడా పెద్ద బిజినెస్ ప‌ర్స‌న్లుగా మారిపోతున్నారు చాలామంది.ఇక ఇలాంటి ఐడియాతోనే ఓ యువ‌కుడు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు.

 Making Soap With Donkey Milk .. A Young Man Earning Coats, Soaps, Donkey Milk, E-TeluguStop.com

అయితే ఆయ‌న త‌న ఐడియా గురించి ముందుగా చెప్పగానే అందరూ న‌వ్వి అత‌న్ని అవ‌మానించారు.చాలామంది అంటే స్నేహితులు, బంధువులు కూడా ఎగతాళి చేసిన వారేన‌ట‌.

అయితే ఆయ‌న ఐడియా ఏంటంటే గాడిద పాలతో సబ్బులు చేయాల‌ని అనుకున్నాడు.దాంతో అంద‌రూ దీనితో లాభాలు గడిస్తావా నువ్వు అంటూ వెక్కిరించిన వారు కూడా ఉన్నారంట‌.

కానీ స‌రిగ్గా ఏడాది తిరిగే స‌రికి వ్యాపారాన్నిప్రారంభించి భారీగా లాభాలు గ‌డిస్తున్నారు.జోర్డాన్ నివాసి అయిన‌టువంటి 32 ఏళ్ల యువ‌కుడు ఎమాద్ అట్టియట్ వియ‌గాధ ఇది.ఎమాద్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చ‌దువుకుని ఇందులో ఆయ‌న పోస్ట్ గ్రాడ్యువేట్ ప‌ట్టా పొందాడు.ఇంత చ‌దువుకున్నా కానీ ఆయ‌న‌కు జాబ్ దొరక‌క‌పోవ‌డంతో నిరాశ ప‌డ్డాడు.

అయితే త‌న తల్లి ఇచ్చిన సలహాతో చివ‌ర‌కు ఎమాద్ ఈ విధ‌మైన స‌బ్బుల త‌యారీ రంగంలోకి దిగి స‌క్సెస్ అయ్యాడు.గాడిద పాలతో సబ్బులు త‌యారు చేస్తే బాగా బిజినెస్ అవుతుంద‌ని ఎమాద్ తల్లి అనుకుంది.

Telugu Amad Attiyar, Bussiness, Donkey Mil, Donkey Milk, Crors, Jordan, Soap-Lat

ఇక దీంతో వారు అనుకున్న‌ట్టు గానే ఎవ‌రు ఎన్ని విమర్శలు చేసినా లేదా నెగెటివ్ కామెంట్స్ చేసినా అస్స‌లు ప‌ట్టించుకోకుండా ముందుకెళ్లారు.ఇంకేముంది వారి క‌ష్టానికి ప్ర‌తిఫ‌లంగా ఏడాది తిరిగే సరికల్లా భారీగా లాభాలు రావ‌డంతో వారు అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.వీరు 12 గాడిదలను త‌మ ద‌గ్గ‌ర పెంచుకుంటూ వాటి ద్వారా సబ్బులు తయారవుతాయి.ఇక వాటిని ఎమాద్ మార్కెట్‌లో విక్ర‌యిస్తారు.చిన్న‌గా స్టార్ట్ అయిన వీరి వ్యాపారాం ఇప్పుడు కోట్ల‌కు దారి తీస్తోంది.ఎవ‌రూ న‌డ‌వ‌ని దారిలో న‌డిస్తే క‌చ్చితంగా గుర్తింపు ఉంటుంద‌ని చెప్ప‌డానికి వీరే ఉదాహ‌ర‌ణ‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube