Hyderabad robot : చనిపోయిన వాళ్ల రూపంలో రోబోలు తయారీ.. హైదరాబాద్ సంస్థ ఘనత

హైదరాబాద్ కు చెందిన ఒక యంగ్ ఇంజనీర్ తన వినూత్న ఆలోచన, క్రియేటివిటీతో తయారుచేసి రోబో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.ఆయన పేరు ఫణి కుమార్.

 Making Robots In The Form Of Dead People.. Credit To Hyderabad Company Hyderabad-TeluguStop.com

ఈ ఇంజనీర్ ఆర్డర్ల మేరకు ఎవరిలా అంటే వారిలా రోబోలను తయారు చేసి ఇవ్వగలడు.ఇందుకోసం తాజాగా ఒక రోబో హౌస్ ఏర్పాటు చేశారు.

రోబోల తయారుదారు ఫణికుమార్ ఇప్పటివరకు తన తల్లి ప్రతిరూపాన్ని రోబోలో చూసుకునేలా ఒక ఆపరేషన్ రోబో తయారు చేశాడు.ఈ రోబోకి చీర కట్టి ఒక అచ్చ తెలుగు యువత లాగా తీర్చిదిద్దాడు.

ఆ రోబో లోనే తన తల్లిని చూసుకుంటున్నానని అతను చెబుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

ఈ రోబోతో పాటు మరి కొన్ని రోబోలను కూడా డెవలప్ చేసినట్లు ఫణికుమార్ మీడియాకి తెలిపాడు.

తాను మొదటిగా చేసిన రోబో కి మైత్రి అనే నామకరణం చేశాడు.అలానే మరొక రోబోను రెస్టారెంట్‌లో ఫుడ్ సర్వ్ చేసేలా తయారు చేశాడు.

ఇంట్లో ఎవరైనా చనిపోతే వారు తమ దగ్గరే ఉన్నట్లు ఫీల్ అవ్వాలనుకునేవారు ఫణి కుమార్ ని కలవచ్చు.

Telugu Robots, Hyderabad, Hyderabad Robot, Latest-Latest News - Telugu

అతను చనిపోయిన మీ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నట్లు ఫీల్ తెప్పించేలా ఒక రూపాన్ని తయారు చేస్తాడు.దాన్ని తెచ్చుకుని మీరు మీ బాధను పోగొట్టుకోవచ్చు.ఫణి కుమార్ ఐడియాని, క్రియేటివిటీని చాలామంది మెచ్చుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రతిభావంతులు ఉన్నందుకు చాలా మంది గర్వంగా ఫీల్ అవుతున్నట్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube