విబూదిని ఎలా తయారు చేస్తారో తెలుసా?  

Making Of Vibhuthi-

 • విబూది అంటే పాపాలను హరించేది మరియు పవిత్రమైన భస్మం అని అర్ధం. మనిషఅయినా చెట్టు అయినా కాలితే అయ్యేది భస్మమే కానీ అది నిజమైన విభూది కాదనచెప్పాలి.

 • విబూదిని ఎలా తయారు చేస్తారో తెలుసా?-

 • సాధారణంగా గోమయ భస్మాన్నే విబూదిగా చెప్పుతారు. ఆవు పేడనసేకరించి పిడకలుగా చేసి విభూదిని తయారుచేస్తారు.

 • మాస శివరాత్రి రోజు ధాన్యపు పొట్టులోకానీ గడ్డితో కానీ చేసిన అరలలో పిడకలను పెట్టి వేదమంత్రోఛ్ఛారణ మధ్య కాలుస్తారు. ఈ కాలిన పిడకలచల్లారిన తర్వాత తడిపి ఆరబెట్టి దిమ్మలుగా తయారుచేస్తారు.

 • ఈ దిమ్మలనభక్తులకు విభూది పండ్లుగా అందిస్తారు.

  ఈ విభూది పండ్లను ఎక్కువగా కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల ఆలయాలలఉపయోగిస్తారు.

 • సాధారణంగా ఈ విభూది దిమ్మలను గుడులకు అనుసంధానంగా ఉన్గోశాలలో తయారుచేస్తారు. అలాగే రకరకాల ఔషధమొక్కల్ని వాడి చేసే హోమాల నుంచకూడా విబూదిని సేకరిస్తారు.

 • హోమ భస్మంలో ఆవుపేడతో పాటు 108 మూలికలుసుగంధ ద్రవ్యాలు, ఆవు నెయ్యి వుంటాయి.ఈ భస్మాన్ని ధరిస్తే అందులో ఉన్ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తాయి.

  విభూదిని ఉంగరపు వేలు, బొటనవేళ్లతో తీసుకోని కనుబొమల మధ్య,గొంతుమీదఛాతిమీద ఎక్కువగా ధరిస్తారు.

 • విభూది ధరించటం వలన ఆధ్యాత్మిక భావపెరగటంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.