పవన్‌ చేతిలో నిర్మాత జీవిత ఆశయం

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతలు ఎవరు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లలో దిల్‌రాజు పేరు తప్పకుండా ఉంటుంది.ఈయన నిర్మాణంలో చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా నటించేందుకు ఆసక్తిని చూపుతారు.

 Making A Film With Pawan Kalyan Is Dil Raju’s Ambition-TeluguStop.com

కాని ఈయన మాత్రం ఒక హీరోతో సినిమాను నిర్మించడం జీవిత ఆశయంగా పెట్టుకుని ఉన్నాడు.ఆ హీరోతో సినిమా నిర్మిస్తే తన జీవిత ఆశయం నెరవేరినట్లే అంటూ సన్నిహితులతో పాటు మీడియాతో కూడా చెప్పుకొస్తున్నాడు.

ఇంతకు ఆ హీరో ఏ హాలీవుడ్‌ లేక బాలీవుడ్‌ హీరోనో కాదు.మన టాలీవుడ్‌ పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.

దిల్‌రాజుకు చాలా సంవత్సరాలుగా పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే కోరిక ఉంది.ఆ కోరికతోనే పవన్‌ డేట్ల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

‘గబ్బర్‌సింగ్‌’ తర్వాత దిల్‌రాజు నిర్మాణంలో నటించేందుకు పవన్‌ ఓకే చెప్పాడు.అయితే ఇప్పటి వరకు కూడా డేట్లు ఇవ్వలేదు.

‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత పవన్‌ కళ్యాణ్‌, దిల్‌రాజు నిర్మాణంలో సినిమా చేస్తాడు అంటూ ప్రచారం జరిగింది.కాని పవన్‌ మాత్రం దిల్‌రాజుకు డేట్లు ఇవ్వలేదు.

తాజాగా మరోసారి దిల్‌రాజు తన మనస్సులోని మాటను చెప్పుకొచ్చాడు.పవన్‌తో సినిమా చేసేందుకు ఎంత కాలం అయినా ఎదురు చూస్తాను అని, వచ్చే సంవత్సరంలో ఆయనతో సినిమా నిర్మిస్తాను అనే నమ్మకం ఉందని దిల్‌రాజు చెప్పుకొచ్చాడు.

మరి రాజుగారి జీవిత ఆశయంను పవన్‌ నెరవేర్చుతాడా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube