లక్ష్య టైటిల్ ని కన్ఫర్మ్ చేసుకున్న నాగ శౌర్య  

యంగ్ హీరో నాగశౌర్య కెరియర్ లో ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ తోనే ఎక్కువ సినిమాలు చేశాడు.అయితే ఇకపై తన ఇమేజ్ మార్చుకోవాలని డిసైడ్ అయ్యి కంప్లీట్ గా కమర్షియల్ యాక్షన్ ఫార్మాట్ లోకి దిగిపోయాడు.

TeluguStop.com - Makers Opts Title Lakshya For Naga Shaurya Archery Film

అందులో భాగంగా ఏకంగా లుక్ కూడా మార్చేసి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక సినిమా పూర్తి చేశాడు.ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ కోసం నాగ శౌర్య ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీని బిల్డ్ చేశాడు.ఇప్పటికే సినిమాలో అతని క్యారెక్టర్ కి సంబంధించిన లుక్స్ రిలీజ్ అయ్యి వైరల్ అయ్యాయి.

TeluguStop.com - లక్ష్య టైటిల్ ని కన్ఫర్మ్ చేసుకున్న నాగ శౌర్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి తాజాగా టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.గతంలో ఈ సినిమా కోసం పార్ధు అనే టైటిల్ అనుకున్నారు.

అయితే అది వర్క్ అయ్యేలా లేదని మరలా కొత్త టైటిల్ ని ఫైనల్ చేసెనట్లు తెలుస్తుంది.

నాగశౌర్య కొత్త చిత్రానికి లక్ష్య అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించి ఈ రోజు అధికారికంగా ప్రకటన రానున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.ఇదే టైటిల్ తో బాలీవుడ్ హృతిక్ రోషన్ ఒక సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.

ఈ నేపధ్యంలో టైటిల్ కి మంచి పాజిటివ్ వైబ్ ఉంటుందని దీనిని ఖరారు చేసినట్లు.సమాచారం గతంలో గోపీచంద్, జగపతి బాబు కాంబినేషన్ లో లక్ష్యం టైటిల్ తో ఒక సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు నాగశౌర్య, జగపతి బాబు కాంబినేషన్ లో లక్ష్య టైటిల్ తో మూవీ రాబోతూ ఉండటం యాదృశ్చికం అని చెప్పాలి.మరి ఈ సినిమా శౌర్యకి ఎంత వరకు సక్సెస్ ఇస్తుంది అనేది వేచి చూడాలి.

#Jagapathi Babu #Lakshya #Ollywood #Naga Shaurya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు