'గని' రిలీజ్ డేట్ పై డైలమాలో ఉన్న మేకర్స్.. అందుకేనట!

ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని సినిమాలో నటిస్తున్నాడు.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.

 Makers In A Dilemma Over 'gani' Release Date, Varun Tej, Gani, Varun Tej Gani Mo-TeluguStop.com

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఇందులో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.

షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.ఇక ఎట్టకేలకు విడుదల తేదీ ప్రకటించింది.ఈ సినిమాను డిసెంబర్ 24 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా వాయిదా వేస్తున్నారని టాక్.ఎందుకంటే ఈ నెలలోనే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో డిసెంబర్ 17న రాబోతున్నాడు.

Telugu Gani, Makersdilemma, Pushpa, Varun Tej, Varun Tej Gani-Movie

ఇక ఆ తర్వాత నాని శ్యామ్ సింగ రాయ్ కూడా డిసెంబర్ 24 నే గని సినిమాకు పోటీగా రాబోతున్నాడు.ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్ డైలమాలో ఉన్నట్టు తెలుస్తుంది.ఇక డిసెంబర్ లో ఈ సినిమాను వాయిదా వేస్తె సంక్రాంతి ముందు కూడా రిలీజ్ చేసే పరిస్థితి లేదు.ఎందుకంటే జనవరి నెలలో సంక్రాంతి కానుకగా వరుసగా పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి.

Telugu Gani, Makersdilemma, Pushpa, Varun Tej, Varun Tej Gani-Movie

ఇక పాన్ ఇండియా సినిమాలు విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో గని సినిమాను విడుదల చేస్తే కలెక్షన్స్ కు గండి పడుతుంది.అందుకే మేకర్స్ రిలీజ్ చేసే ఆలోచనలో లేనట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాను జనవరి మూడవ వారంలో అభిమానుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని సమాచారం.

అప్పుడైతేనే ఎటువంటి పోటీ లేకుండానే సేఫ్ గా విడుదల అవ్వడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం ఉండదని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube