దోమల్ని తరిమికొట్టే సూపర్ ఉపాయం

దోమల బాధ రోజుకి రోజుకి ఎక్కువైపోతోంది కదా.అసలే వర్షాకాలం.

 Make Your Own All-out At Home To Kill Mosquitoes-TeluguStop.com

ఇప్పుడు ఈ దోమల బెడద మరింత ఎక్కువగా ఉంటుంది.అలవుట్, గుడ్ నైట్ అని, ఇంకా కాయిల్స్ అని కెమికల్స్ తెచ్చిపెట్టేసుకుంటారు ఇంట్లో.

దోమల్ని చంపటంతో పాటు, ఆ కెమికల్స్ ని పీల్చుకోని మనమే అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నాం.ఇలా కాకుండా మీకు మీరే ఒక సహజమైన ఆలవుట్ ని తయారుచేసుకోవచ్చు.

ఎలా అంటే, ఖాలిగా ఉండే ఆలవుట్ రీఫిల్ ని తీసుకోని, దాంట్లో పూజకి వాడే కర్పూరం బిల్లలను వేయండి.ఆ తరువాత అయూర్వేద దుకాణాల్లో దొరికే వేప నూనేతో రీఫీల్ ని నింపండి.

ఆ తరువాత రీఫీల్ ని మళ్ళీ ఫిక్స్ చేసి ఆలవుట్ వాడుకున్నట్లే ప్లగ్ లో పెట్టి వాడుకోవచ్చు.

ఇది చాలా ఉపయోగకరం.

ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ వాడకుండా దీన్ని తయారుచేసుకుంటాం.ఇంట్లో గాలి కూడా కలుషితం కాదు.

కర్పూరం వాసన ఎంత బాగా ఉంటుందో మనకు తెలిసినదే.అన్నిటికి మించి కెమికల్స్ పీల్చుకునే దుస్థితి ఉండదు.

సహజమైన వనరులతో దోమల్ని తరిమికొట్టొచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube