ఈనెల 14న జరిగే సదస్సును విజయవంతం చేయాలి: నాగన్న గౌడ్

సూర్యాపేట జిల్లా: కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈనెల 14న జిల్లా కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో జరుగు సదస్సును విజయవంతం చేయాలని ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్(Naganna Goud ) పిలుపునిచ్చారు.

గురువారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.

గత తొమ్మిది సంవత్సరాలుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను కుదించి, నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక హక్కులను హరిస్తుందని ఆరోపించారు.కార్మికుల సమస్యల పరిష్కారానికై కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు( Nemmadi Venkateshwarlu ), ఏఐటీయూసీ ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్,ఐఎన్టియుసి ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ బంటు చుక్కయ్య గౌడ్, సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.రాంబాబు, చెన్నగాని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

దూరవిద్య ద్వారా ఉన్నత విద్యా లక్ష్యాలను చేరుకోవడం సులభం
Advertisement

Latest Suryapet News