డిగ్రీ సర్టిఫికెట్ కావాలా.. అయితే కట్నం తీసుకోకూడదట.. ఎక్కడంటే ?

వరకట్నం తీసుకోవడం చట్టరీత్య నేరం అని తెలిసిన ఈ దురాచారాన్ని ఇంకా ప్రోత్సహిస్తూనే ఉన్నారు.టెక్నాలిజీ ఎంత పెరుగుతున్న ఇంకా వరకట్న వేధింపులు మాత్రం తగ్గడం లేదు.

 Make Students Sign 'no Dowry Bond' Before Awarding Degrees, Kerala, Governor Ari-TeluguStop.com

పోనీ చదువు లేని వాళ్ళు ఇలా కట్నం అని అడుగుతున్నారా అంటే అదీ లేదు.బాగా చదువు కుని మంచి మంచి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా ఇలా వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారు.

పెళ్లి తర్వాత కూడా అధిక కట్నం కోసం భార్యను వేధిస్తున్నారు.

ప్రభుత్వాలు వరకట్న వేధింపులకు పాల్పడిన వారి మీద ఎన్ని చట్టాలు తీసుకు వచ్చిన కూడా మహిళలపై వేధింపులు మాత్రం తగ్గడం లేదు.

ఇప్పటికీ చాలా మంది మహిళలు వరకట్న వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యల కు పాల్పడుకున్నారు.కేరళలో ఇలాంటి సమస్యలు ఎక్కువుగా రావడంతో అక్కడి ప్రభుత్వం వరకట్న దురాచారాన్ని పూర్తిగా రూపు మాపేందుకు ఒక చట్టాన్ని తీసుకు రాబోతుంది.

కేరళ రాష్ట్ర గవర్నర్ ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు.వరకట్న సమస్యను పూర్తిగా లేకుండా నిర్ములించాలంటే యువతకు దీనిపై అవగాహన కల్పించాలని ఆయన తెలిపాడు.

ఆ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్ అందుకోక ముందే ఫ్యూచర్ లో కట్నం తీసుకోమని బాండ్లపై సంతకాలు తీసుకోవాలని ఆయన విద్యాసంస్థలకు తెలుపుతున్నారు.

Telugu Dowry, Governorarif, Kerala, Dowrybond, Dowry Bonds, Chancellors-Latest N

అక్షరాస్యత ఎక్కువగా ఉన్న కేరళలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని అందుకే విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో పెట్టడానికి ముందే వరకట్నం తీసుకోము.ఇవ్వము.అని సంతకాలు చేయించు కోవాలని అలా చేసేలాగా వారికీ అవగాహన కల్పించాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చెప్పారు.

ఈ నిర్ణయంపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని ఈ దురాచారాన్ని నిర్ములించడానికి అందరు కృషి చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube