ఆ సమయంలో నిద్రపోతే వీర్యం బలంగా ఉంటుంది  

Make Stronger By Sleeping Between 8pm To 10pm-

వీర్యం యొక్క బలం రానురాను తగ్గిపోతోందని పరిశోధకులు ఎప్పటినుంచో చెబుతున్నారు.దానికి కారణం పురుషుల లైఫ్ స్టయిల్.ఆ లైఫ్ స్టయిల్ లో ఉండే అలవాట్లు.ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్లతో పాటు సమయానికి నిద్రపోకపోవడం అనే మరో చెడు అలవాటు కూడా కామన్ అయిపోయింది ఈరోజుల్లో.

అందుకే పురుషుల్లో స్మెర్మ్ కౌంట్ పడిపోతోంది.ఈ విషయం మీద హర్బిన్ మెడికల్ యూనివర్సిటీ వారు పరిశోధన చేసి ఓ పరిష్కార మార్గాన్ని సూచించారు.

-

మెడికల్ సైన్స్ మానిటర్ అనే మెడికల్ జర్నల్ లో ప్రచురించిన కథనం ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల సమయంలో నిద్రపొయే అలవాటు చేసుకున్న వారి వీర్యం బలంగా ఉంటుందట.ఎందుకు అంటే, ఈ సమయంలో పడుకునే వారు రోజుకి 7-8 గంటలు పడుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది.

అలా కాకుండా ఆలస్యంగా పడుకున్న వారు రోజుకి 4-6 గంటల నిద్రతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.అలా లేటుగా నిద్రలోకి జారుకోని తక్కువ సేపు పడుకోవడం వలన శరీరంలో యాంటి స్పెర్మ్ బాడీస్ పెరిగిపోతాయి .

దీంతో వీర్యకణాల ఉత్పత్తి తక్కువ జరుగుతుంది.అలాగే వీర్య కణాలలో ఈత కొట్టే శక్తి లేదా స్పెర్మ్ మొబిలిటి తగ్గుతుంది.

ఈ పరిశోధన కోసం హర్బిన్ మెడికల్ యూనివర్సిటీ వారు 981 మంది పురుషులని తీసుకున్నారు.కొన్ని రోజులు వారిని 8-10 గంటల మధ్యలో పడుకొని, 7-8 గంటల నిద్ర తీయమని చెప్పారు.

అప్పుడు వారి వీర్యం యొక్క శాంపిల్స్ తీసుకోని టెస్టులు చేసారు.ఆ తరువాత మళ్ళీ పురుషులనే ఆలస్యంగా పడుకోని 4-6 గంటల నిద్రతీయమన్నారు.

అలా కొన్ని రోజులు చేసిన తరువాత వీర్యం యొక్క శాంపిల్స్ మళ్ళీ తీసుకోని మళ్ళీ పరీక్షించారు.

రెండు శాంపిల్స్ ని గమనిస్తే మనిషిలో పట్టుత్వం తగ్గుతున్న విషయం స్పష్టంగా కనిపించిందట.

రెండొవసారి వీర్యకణాల కౌంట్ పడిపోవటం, అలాగే స్పెర్మ్ మొబిలిటి తగ్గడం కనిపించింది.అందుకే త్వరగా నిద్రలోకి వెళ్ళి, సరిపడ నిద్రతీసి, త్వరగా నిద్రలేచే అలవాటు చేసుకోవాలి.

తాజా వార్తలు

Make Stronger By Sleeping Between 8pm To 10pm- Related....