లోగోను కాపీ కొట్టలేదు  

Make In India Lion Logo Not Inspired By Swiss Bank Ad-

English Summary:In India, we know how to make the logo. Modi government made in the image of the lion in a variety of industrial wheels, which appear to be related to the equipment.However, that is not the idea of ​​the logo in the Modi government, own, inspired by the Swiss bank statement (in a normal copy ceppalante hitting) had a report was made. The government dismissed it decayed.Make in India was not prepared to see the logo of the Swiss bank said in a statement. Make in India Logo Vibrant, dynamic there, the Swiss bank said that the ad image .Some people say, boring.Kantonal Bank of Zurich, is the logo of our Make in India is similar to the logo. The problem has been copied around the world.Movies, books, songs ..Both in terms of being roughed up several copy.Poteponile some cases in the courts are some of the urukunte. And now the case is in the court of the Indian government, the Swiss bank logo copy kottindantu would .....

మేక్‌ ఇన్‌ ఇండియా లోగో ఎలా ఉంటుందో మనకు తెలుసు. మోదీ ప్రభుత్వం తయారుచేసిన ఈ సింహం బొమ్మలో వివిధ రకాల పారిశ్రామిక చక్రాలు, అందుకు సంబంధించిన సామగ్రి కనబడుతుంటాయి. అయితే ఈ లోగో మోదీ సర్కారు సొంత ఆలోచన కాదని, స్విస్‌ బ్యాంకు ప్రకటన నుంచి స్ఫూర్తి పొంది (మామూలు భాషలో చెప్పలంటే కాపీ కొట్టడమే) తయారు చేశారని ఓ నివేదికలో వచ్చింది..

లోగోను కాపీ కొట్టలేదు-

దీన్ని ప్రభుత్వం తోసి పుచ్చింది. మేక్‌ ఇన్‌ ఇండియా లోగోను స్విస్‌ బ్యాంకు ప్రకటన చూసి తయారు చేయలేదని వివరించింది. మేక్‌ ఇన్‌ ఇండియా లోగో వైబ్రాంట్‌గా, డైనమిక్‌గా ఉందని, స్విస్‌ బ్యాంకు ప్రకటనలోని బొమ్మ డల్‌గా బోరింగ్‌గా ఉందని పేర్కొంది.

కాంటోనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ జ్యూరిచ్‌ లోగో మన మేక్‌ ఇన్‌ ఇండియా లోగో మాదిరిగానే ఉంటుంది. కాపీ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. సినిమాలు, పుస్తకాలు, పాటలు…ఇలా ఎన్నో కాపీ కొడుతున్నారు. కొందరు పోతేపోనీలే అని ఊరుకుంటే కొందరు కోర్టుల్లో కేసులు వేస్తారు.

మరి ఇప్పుడు భారత ప్రభుత్వం లోగో కాపీ కొట్టిందంటూ స్విస్‌ బ్యాంకు కోర్టులో కేసు వేస్తుందా?