ఆధార్ లో సమస్యలు ఉన్నాయా..? పరిష్కారం కోసం కొత్త హెల్ప్ లైన్ నెంబర్ షురూ..!

మీ ఆధార్ కార్డు లో తప్పులు ఏమైనా ఉన్నాయా.? వాటి కోసం మార్పులు చేయాలనుకుంటున్నారా.? అందుకోసం ప్రతి చిన్న పనికి ఆధార్ సెంటర్ కు వెళ్ళడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయా.? అయితే ఇప్పుడు వీటి అన్నిటికీ పరిష్కారంగా ఆధార్ హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి మీ సందేహాన్ని ఇట్లే పూర్తి చేసుకోవచ్చు.ఆధార్ కార్డు బాధ్యతలను నిర్వహిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సమస్యల పరిష్కారం కోసం ప్రజల కొరకు కొత్త హెల్ప్ లైన్ నెంబర్ లాంచ్ చేసింది.1947 అనే హెల్ప్ లైన్ నెంబర్ వారం మొత్తం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

 New Helpline Number Aadhar Card,1947,uidai, Aadhar Card, Helpline Number, Mistak-TeluguStop.com

ఈ నెంబర్ కు ఏజెంట్లు సోమవారం నుండి శనివారలలో ప్రతిరోజు ఉదయం ఏడు గంటల సమయం నుండి 11:00 వరకు సేవలను పొందగలరు.అలాగే ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సేవలను పొందగలరు.

కాకపోతే ఈ హెల్ప్ లైన్ నెంబర్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, గుజరాతీ , మరాఠీ, పంజాబీ, బెంగాలీ, ఒరియా, అస్సామీ, ఉర్దూ భాషలలో సేవలను అందించబోతుంది.మీకు నచ్చిన భాషలో సంభాషణ చేపట్టే విధంగా యుఐడిఏఐ చర్యలను చేపట్టింది.

ఇందులో రోజుకి ఏకంగా లక్షన్నర ఫోన్స్ రిసీవ్ చేసుకునే సామర్థ్యం ను కాల్ సెంటర్ కలిగి ఉంది.అలాగే ఐవిఆర్ఎస్ సిస్టం మాత్రం 24 గంటలు అందుబాటులో ఉండనే ఉంటుంది.మీకు దగ్గరలోని ఆధార్ సెంటర్ వివరాలు అలాగే ఆధార్ ఎన్రోల్మెంట్ స్టేటస్ ఇంకా వివిధ రకాలైన సేవలను 1947 నెంబర్ కు కాల్ చేసి పూర్తి సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు.అలాగే మీకు ఆధార్ కార్డు సంబంధించి ఏవైనా సమస్యలని తెలిపేందుకు [email protected] ఈ మెయిల్ ఐడి కి మెయిల్ చేసి పరిష్కారాన్ని పొందవచ్చు.అలాగే ఆధార్ కార్డు సంబంధించి పూర్తి సమాచారం కొరకు యుడిఏఐ అధికారిక వెబ్ సైట్ ను చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube