వైరల్‌ : డోర్‌ ఆటోమెటిక్‌గా క్లోజ్‌ అవ్వడానికి ఇతడు చేసిన పని చూడండి... మహీంద్రా అధినేత మనసు దోచాడు

పెద్ద పెద్ద ఆఫీస్‌లలో డోర్లు తెరుచుకుని వెళ్లి పోతే వాటంతట అవే ఆటోమెటిక్‌గా క్లోజ్‌ అవుతూ ఉంటాయి.అయితే సామాన్యులు మాత్రం అలాంటి సిస్టింను ఇంట్లో పెట్టుకోలేరు.

 Make An Automatic Closing Door Using Water Bottle-TeluguStop.com

ఎందుకంటే ఒక్క డోర్‌కు ఆటోమెటిక్‌ సిస్టంను ఏర్పాటు చేయాలంటే కనీసం 15 వందల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.అంత డబ్బు ఎందుకులే అని చాలా మంది సామాన్యులు దాన్ని ఉపయోగించేందుకు ఆసక్తి చూపరు.

కాని ఒక వ్యక్తి మాత్రం తన ఇంటికి అలాంటి ఆటోమెటిక్‌ క్లోజింగ్‌ సిస్టం ఉండాలని ఆశ పడ్డాడు.

ఆ ఆటోమెటిక్‌ సిస్టంను తన డోర్‌కు ఫిట్‌ చేయడం సాధ్యం కాకపోవడంతో పాటు, ఆర్థికంగా ఎక్కువ అవుతున్నదనే ఉద్దేశ్యంతో అతడు ఒక వినూత్న ప్రయోగం చేశాడు.

కేవలం రెండు రూపాయల ఖర్చుతో తన డోర్‌కు ఆటోమెటిక్‌ డోర్‌ క్లోజింగ్‌ సిస్టంను ఏర్పాటు చేశాడు.అతడి ఆలోచనకు మహీంద్ర గ్రూప్స్‌ అధినేత ఆనంద్‌ మహీంద్ర కూడా అవాక్కయ్యారు.

అతడి వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి అతడి గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు.

ఇంతకు అతడు ఏం చేశాడంటే… ఒక వాటర్‌ బాటిల్‌లో నీళ్లు నింపి దాన్ని తాడుతో కట్టి డోరుకు ముందు బాగంలో కట్టాడు.డోర్‌ ఓపెన్‌ చేసిన సమయంలో వాటర్‌ బాటిల్‌ పైకి వెళ్తుంది.ఆ తర్వాత మెల్లగా వాటర్‌ బాటిల్‌ కిందకు వస్తుంది.

ఆ సమయంలో డోర్‌ క్లోజ్‌ అవుతుంది.అలా డోర్‌ ఆటోమెటిక్‌గా క్లోజింగ్‌ సిస్టంను అతడు తయారు చేశాడు.

అతడు చేసిన ప్రయోగం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయంటూ జనాలు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube