ఎప్పుడు టికెట్ అంశంపైనేనా.. ఆ ధరల గురించి పట్టించుకోరా?

కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ బాగా కుదేలైందనే చెప్పాలి.గత రెండేళ్లలో చాలా పరిస్థితులు మారిపోయాయి.

 Major Problems Of Indian Film Industry Details, Indian Film Industry, Major Problems, Theaters, Snacks, Snacks Rates, Tollywood Industry, Family Audience, Movies, Ott-TeluguStop.com

ఇక కరోనా తగ్గుముఖం పట్టింది అనుకుంటే ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లి సినిమాలు చూడడానికి ఇష్టపడడం లేదు.అందుకు కారణాలు కూడా ఉన్నాయి.

టికెట్ ధరలు సామాన్యులకు భారంగా మారిపోయాయి.

 Major Problems Of Indian Film Industry Details, Indian Film Industry, Major Problems, Theaters, Snacks, Snacks Rates, Tollywood Industry, Family Audience, Movies, Ott-ఎప్పుడు టికెట్ అంశంపైనేనా.. ఆ ధరల గురించి పట్టించుకోరా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఈ టికెట్ ఇష్యుపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవ్వరు చుసిన టికెట్ ధరలపై మాట్లాడుతున్నారు.కానీ మరొక ఇంపార్టెంట్ విషయం మాట్లాడు కోవడం మర్చిపోతున్నారు.ఒక ఫ్యామిలీ మ్యాన్ సినిమాకు వెళ్లాలంటే భయపడే రోజులు వచ్చేసాయి.

భార్య భర్తలు పిల్లలతో కలిసి సినిమాలు వెళ్తే 1000 నుండి 1500 అవుతుంది.

అయితే ఇవే కాకుండా అదనంగా మరొక ఖర్చు కూడా ప్రేక్షకుడి నెత్తిన పడుతుంది.టికెట్ కు ఖర్చు ఎంత పెట్టారో అంత అదనంగా స్నాక్స్ కు పెట్టాల్సి వస్తుంది.

ఇలా దోచుకుంటున్న నేపథ్యంలో ఒక కుటుంబం వెళ్లాలంటే 2000 జేబులో పెట్టుకోవాల్సిందే.అంత ఖర్చు పెట్టి ఆ సినిమా చూడడం అవసరమా? కొద్దీ రోజుల్లో ఓటిటిలో వస్తుంది హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూడవచ్చు అనే మైండ్ సెట్ ఏర్పడింది.

Telugu Audience, Indian, Problems, Rates, Theaters, Tollywood-Movie

ఈ ఆలోచన వల్లనే సినీ ఇండస్ట్రీలు కుదేలవుతున్నాయి.టికెట్ రేట్ పెంచితే మరికొంత లాభం వస్తుంది అని నిర్మాతలు భావిస్తే అసలు మేము సినిమాలకే రాము అని ప్రేక్షకులు భావిస్తున్నారు.ఇప్పుడు నిర్మాతలు షూటింగ్ బంద్ ప్రకటించిన కారణాలు కూడా ఆదాయం లేకపోవడమే.

అయితే ఇక్కడ సినీ పెద్దలు మరో విషయం మర్చిపోతున్నారు.

టికెట్ రేట్స్ కు ధీటుగా వసూలు చేస్తున్న స్నాక్స్ రేట్స్ కూడా సినిమాలకు వెళ్ళకపోవడానికి రీజన్ అని తెలుస్తుంది.ఫ్యామిలీ పర్సన్స్ సినిమాకు వెళ్లాలంటే నిలువు దోపిడీకి గురి అవుతున్నారు.

దీంతో వద్దు బాబోయ్ అనే పరిస్థితికి వచ్చింది.మరి టికెట్ సమస్యనే పట్టుకుని వేలాడుతున్న సినీ పెద్దలు ఇలాంటివి కూడా పట్టించుకుంటే బాగుంటుంది.

అప్పుడే సామాన్యులు కూడా థియేటర్స్ కు వచ్చి సినిమాలు చూస్తారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube