మజ్ను రివ్యూ

చిత్రం : మజ్ను

 Majnu Movie Review-TeluguStop.com

బ్యానర్ : ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్,

దర్శకత్వం : విరించి వర్మ
నిర్మాత : గీతా గొళ్ళా, పి.కిరణ్

సంగీతం : గోపి సుందర్

విడుదల తేది : సెప్టెంబర్ 23, 2016

నటీనటులు : నాని, అను ఎమ్మానుయేల్, ప్రియ, వెన్నెల కిషోర్ తదితరులు
భలే భలే మొగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్ మన్ లాంటి విజయవంతమైన చిత్రాలతో, కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు నాని.మరోవైపు ఉయ్యాల జంపాల వంటి హిట్ తో బోణి కొట్టాడు దర్శకుడు విరించి వర్మ.ఇద్దరి సక్సెస్ ట్రాక్ లో బ్రేక్ పడకూడదు.మరి మజ్ను ఈ ఇద్దరి ఫామ్ ని కంటిన్యూ చేసిందో లేదో చూద్దాం
కథలోకి వెళ్తే …
ఆదిత్య (నాని) ఎస్ ఎస్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు.తొలిచూపులోనే సుమ (ప్రియ శ్రీ) ని చూసి ఆకర్షితుడైపోతాడు.

ఆదిత్య ప్రేమను ఒప్పుకోవాలంటే తన క్యారెక్టర్ తెలియాలని, అందుకోసం తన పాత లవ్ స్టోరి మొత్తం చెప్పాల్సిందే అని పట్టుపడుతుంది సుమ.దాంతో కిరణ్మయితో (అను) భీమవరంలో నడిచిన తన విఫలప్రేమ మొత్తం చెప్పేస్తాడు ఆదిత్య.కాని సుమకి తన ప్రేమకథ చెబుతూ చెబుతూ, కిరణ్మయి విషయంలో తాను చేసిన తప్పుతో పాటు, తాను ఇంకా కిరణ్మయినే తప్ప సుమని ప్రేమించట్లేదని అర్థం చేసుకుంటాడు ఆదిత్య.
మరి ఆదిత్య – కిరణ్ మళ్ళీ ఒకటయ్యారా ? లేక ఆదిత్య సుమల ప్రేమకథ సుఖాంతం చూసిందా ? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మజ్ను చూడాల్సిందే

నటీనటుల నటన గురించి

నేచురల్ స్టార్ అనే బిరుదు తనకి ఎందుకిచ్చారో నాని మరోసారి నిరూపించుకున్నాడు.నానికి మాత్రమే సాధ్యపడే నెచురల్ ఫ్లో కామెడీతో, ఇంచు కూడా ఎక్కువ చేస్తున్నట్లు అనిపించని ఎమోషన్స్ తో సినిమా మొత్తం, అంతా తానై నడిపించాడు.
హీరోయిన్లద్దరిలో అను ఎమ్మానుయేల్ పాత్ర పెద్దగా ఉంది.

చూడ్డానికి అందమైన బొమ్మ లాగే ఉంది కాని బొమ్మ లాగే హావాభావాలు సరిగా పలకించలేకపోయింది.ప్రియ శ్రీ కూడా ఓ మార్క్ క్రియేట్ చేయలేకపోయింది.

వెన్నెల కిషోర్ మరోసారి మెరిసాడు.సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ సన్నివేశాలన్ని కడుపుబ్బా నవ్విస్తాయి.

రాజమౌళి స్పెషల్ అపియరెన్స్ సినిమాకి చాలా పెద్ద ఆకర్షణ.రాజమౌళి సన్నివేశాల్లో కూడా మంచి కామెడి ఉండటం మరో ప్లస్ పాయింట్.

మరో అతిథి పాత్రలో హీరో రాజ్ తరుణ్ మెప్పించాడు.పోసాని ఉన్నకొద్దిసేపు నవ్వించారు

సాంకేతికవర్గం పనితీరు
గోపిసుందర్ సంగీతం ఈ సినిమాకు పెద్ద అస్సెట్.

బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఉండకపోవచ్చు కాని, పాటలు అస్సలు విసుగు పుట్టించవు.మెలోడిలు అలా కథలో కలిసిపోతాయి.

నేపథ్య సంగీతం కూడా బాగుంది.జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫి అందంగా ఉంది.

ఎడిటింగ్ కాస్త లూజ్ గా ఉంది.నిర్మాణ విలువలు బాగున్నాయి.

విరించి వర్మ కథ చాలా పెద్దదేమి కాదు.సంభాషణలు కూడా బాగున్నాయి.
విశ్లేషణ :
బలమైన కథ కాదు.కాని ఎక్కడా బోర్ కొట్టకుండా, నాని కామేడి టైమింగ్ ని నమ్ముకోని సినిమా అంతా నడిపించాడు దర్శకుడు.

అంత ముఖ్యమైన పాత్రలు కథలో ఉన్నప్పుడు ఇద్దరు హీరోయిన్స్ సెలెక్షన్ లో ఇంకా జాగ్రత్తగా అలోచించాల్సింది.ముఖ్యంగా కిరణ్ పాత్రకి అవసరమైన అభినయం అను ఎమ్మానుయేల్ లో ఎక్కడా కనిపించలేదు.

ఇంటర్వల్ ట్విస్టు బాగుంది.కాని సెకండాఫ్ మొత్తం ఏం జరగబోతోందో ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది.
అలాగే ఆదిత్య భీమవరంలో కిరణ్ ని వదిలేసి హైదరబాద్ కి రావడానికి ఫర్వాలేదనిపించే రీజన్ ని పెట్టేసుకున్నా, కిరణ్ ఆదిత్యతో తగవులు పెట్టుకోవడానికి బలమైన కారణమే కనిపించదు.అప్పటిదాకా వారిద్దరి మధ్య జరిగిన బరువైన (లోతైన) ప్రేమకథ వలన ఆ కారణాలు కొంచెం సిల్లిగానే అనిపిస్తాయి

క్లయిమాక్స్ మిగితా సినిమాలకి కాస్త భిన్నంగా ప్లాన్ చేయడం, అక్కడ ప్రేమలేఖను వాడుకోవడం, మళ్ళీ చివర్లో రాజమౌళి చమక్కుతో సినిమా బాగానే ఎండ్ అవుతుంది.

కాని నాని లాంటి కామేడి టైమింగ్ ఆర్టిస్టు లేకపోయుంటే డైరెక్టర్ తప్పులు బాగా కనబడేవి.ఇక ఇలాంటి విశ్లేషణలు పక్కనపెడితే మజ్ను కుటుంబం మొత్తం కూర్చోని కాసేపు నవ్వుకునే ఎంటర్టైనర్.

ఫస్టాఫ్ మంచి లవ్ స్టోరి, సందర్భానికి తగ్గటుగా వచ్చి, కథతో పాటే నడిచే పాటలు, నవ్వులు, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.బాక్సాఫీసు భాషలో చెప్పాలంటే సినిమా హిట్

హైలైట్స్ :
* నాని

* రాజమౌళి, రాజ్ తరుణ్ అతిథి పాత్రలు

* కామెడి, వెన్నెల కిషోర్ సన్నివేశాలు

* సంగీతం

డ్రాబ్యాక్స్ :

* హీరోయిన్స్

* ముందే అంచనా వేయగలిగే సెకండాఫ్

చివరగా :

మన మోడ్రన్ మజ్ను ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేమిస్తాడు, నవ్విస్తాడు, సెంటిమెంట్ తో టచ్ చేస్తాడు

తెలుగుస్టాప్ రేటింగ్ : 3.25/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube