తేజూ మిస్‌ చేసుకుంటే.. చైతూ వాడేసుకున్నాడు  

Majili Movie Got Huge Response From Family Audience-chitralahari Movie Release Date,majili Movie,naga Chaitanya,sai Dharam Tej

నాగచైతన్య, సమంత జంటగా తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మజిలీ’ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. గత నెల రోజులుగా బాక్సాఫీస్‌ వద్ద సరైన సినిమ లేక పోవడం, అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు, యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మజిలీ ఉండటంతో కలెక్షన్స్‌ భారీగా వస్తున్నాయి. మొదటి మూడు రోజుల్లోనే ఏకంగా 17 కోట్లకు ఎక్కువ షేర్‌ వచ్చిందని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. సినిమాకు పోటీ లేకపోవడం వల్ల మంచి జరిగిందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

తేజూ మిస్‌ చేసుకుంటే.. చైతూ వాడేసుకున్నాడు-Majili Movie Got Huge Response From Family Audience

ముందుగా అనుకున్న ప్రకారం అయితే సాయి ధరమ్‌ తేజ్‌ ‘చిత్రలహరి’ చిత్రాన్ని కూడా మజిలీ విడుదలైన తేదీనే అంటూ ఏప్రిల్‌ 5న విడుదల చేయాలి. కాని ఎన్నికల ముందు వద్దనుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత రోజు అంటే ఏప్రిల్‌ 12న రావాలని భావించాడు. ఏప్రిల్‌ 5వ తేదీ నుండి ఏప్రిల్‌ 12వ తేదీకి సాయి ధరమ్‌ తేజ్‌ మారడంతో మజిలీ చిత్రంకు కలిసి వచ్చింది. ఇప్పుడు సాయి ధరమ్‌ తేజ్‌ డేట్‌ మార్చుకోవడం వల్ల ఆయనకు సమస్య తలెత్తింది

..

మజిలీ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చిన కారణంగా మరో వారం రోజుల పాటు జోరు కొనసాగే అవకాశం ఉంది. అంటే రెండు వారాల పాటు మజిలీకే జనాలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఒక వేళ చిత్రలహరి సూపర్‌ హిట్‌ అయ్యి, ప్రేక్షకుల నుండి బ్రహ్మాండమైన టాక్‌ వస్తే తప్ప అప్పుడు చిత్రలహరిని చూస్తారు. ఒకవేళ ఫలితం అటు ఇటు అయితే అంతా కూడా మజిలీనే నడుస్తుంది.

ఇక చిత్రలహరి విడుదలైన వెంటనే జర్నీ కూడా రాబోతుంది. దాంతో మంచి డేట్‌ అయిన ఏప్రిల్‌ 5ను ఫ్లాప్‌ హీరో తేజూ వదిలేసుకున్నాడు.