'మజిలీ'కి అరుదైన రికార్డ్‌... చైతూ కూడా ఇలాంటి రికార్డ్‌ ఊహించి ఉండడు  

Majili Movie Gets New Record In 25 Centers-

అక్కినేని జంట నాగచైతన్య, సమంతలు కలిసి నటించిన ‘మజిలీ’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అద్బుతమైన స్పందన దక్కించుకున్న ఈ చిత్రం దాదాపుగా 35 కోట్ల వసూళ్లను రాబట్టింది.నాగచైతన్య కెరీర్‌లో మొదటి సారి ఈ స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యాయి.ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులు మరో అరుదైన రికార్డును కూడా నాగచైతన్య మరియు సమంతలకు కట్టబెట్టారు.చిత్ర యూనిట్‌ సభ్యులు సైతం ఈ రికార్డును ఊహించి ఉండరు...

Majili Movie Gets New Record In 25 Centers--Majili Movie Gets New Record In 25 Centers-

తాజాగా ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది.అయితే ఈమద్య కాలంలో ఒక సినిమా మూడు వారాలు ఆడటమే గొప్ప.అలాంటిది ఈ చిత్రం 50 రోజులు ఏకంగా 25 థియేటర్లలో పూర్తి చేసుకోవడం జరిగింది.నైజాంలో ఒక్క థియేటర్‌లో కూడా ఈ చిత్రం కనిపించడం లేదు.కాని ఆంధ్రా మరియు సీడెడ్‌లో ఈ చిత్రం దుమ్ము రేపుతోంది.

అక్కడ మంచి వసూళ్లను దక్కించుకోవడంతో పాటు మంచి గౌరవ ప్రధమైన నెంబర్‌ను సాధించడం ఆశ్చర్యకరంగా ఉంది..

Majili Movie Gets New Record In 25 Centers--Majili Movie Gets New Record In 25 Centers-

బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు కూడా ఈమద్య కాలంలో 50 రోజులు ఆడటం లేదు.ఒక వేళ బలంగా ఆడినా కూడా 10 లేదా 15 థియేటర్ల కంటే ఎక్కువ థియేటర్లలో ఆడటం లేదు.ఇలాంటి సమయంలో మజిలీ ఏకంగా 25 థియేటర్లలో సినిమా 50 రోజులను పూర్తి చేసుకున్న నేపథ్యంలో అంతా కూడా అవాక్కవుతున్నారు.మరోసారి ఈ అక్కినేని జంట తప్పకుండా సినిమా చేయాలని కోరుకుంటున్నారు