'మజిలీ' దర్శకుడి కొత్త సినిమాపై వస్తున్న వార్తల్లో నిజం ఎంత?  

Majili Movie Director Next With Vijay Devarakonda-naga Chaitanya,samantha,shiva Nirvana,vijay Devarakonda,మజిలీ,విజయ్‌ దేవరకొండ,శివ నిర్వాణ

 • ‘నిన్ను కోరి’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న శివ నిర్వాన తాజాగా అక్కినేని జంట నాగచైతన్య, సమంతలకు ‘మజిలీ’ చిత్రంతో సూపర్‌ హిట్‌ కమర్షియల్‌ బ్రేక్‌ను ఇచ్చాడు. నాగచైతన్య కెరీర్‌లో బెస్ట్‌ చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు శివ నిర్వానకు ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉంది. దాంతో ఈయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు.

 • 'మజిలీ' దర్శకుడి కొత్త సినిమాపై వస్తున్న వార్తల్లో నిజం ఎంత?-Majili Movie Director Next With Vijay Devarakonda

 • ఇప్పటికే ఈయన విజయ్‌ దేవరకొండతో ఒక సినిమాకు కమిట్‌ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయమై సినీ ఇండస్ట్రీలో ఎంక్వౌరీ చేయగా గతంలో విజయ్‌ దేవరకొండకు కథ చెప్పిన మాట వాస్తవమే కాని ఇప్పటి వరకు ఆ సినిమా ఓకే అవ్వలేదట.

 • మజిలీ ఫలితం నేపథ్యంలో విజయ్‌ దేవరకొండ మరోసారి శివ నిర్వానతో చర్చలు జరుపుతాడేమో అనే ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.

 • మజిలీ చిత్రం విజయంతో శివ నిర్వాన మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు. అయితే అతడి తర్వాత సినిమా ఎవరు హీరోగా ఉంటుందనే చూడాలి.

 • మొదటి సినిమా తర్వాత మజిలీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెండు సంవత్సరాలు తీసుకున్న దర్శకుడు శివ నిర్వాన మూడవ సినిమాకు కూడా కనీసం రెండేళ్లు తీసుకుంటాడని అనిపిస్తుంది.

  Majili Movie Director Next With Vijay Devarakonda-Naga Chaitanya Samantha Shiva Nirvana Vijay Devarakonda మజిలీ విజయ్‌ దేవరకొండ శివ నిర్వాణ

  రామ్‌ చరణ్‌ కూడా శివ నిర్వాన దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని అవి కూడా పుకార్లే అని తేలిపోయింది.

 • మొత్తానికి మజిలీ చిత్రంతో ఒక్కసారిగా శివ నిర్వాన మోస్ట్‌ వాంటెడ్‌ అయ్యాడు. కాని ఆయన కొత్త సినిమా ఎవరితో ఉంటుందనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

 • మరి కొన్ని నెలలు అయితే కాని ఆ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.