నాని 'జెర్సీ' టీంకు చుక్కలు కనిపిస్తున్నాయట.. కారణం 'మజిలీ'!  

Majili Increasing Pressure On Nani Jersey Team-cricket,father,jersey,majili,movie Updates,naga Chaitanya,nani,samantha,sentimental,son,team

నాని హీరోగా గౌతమ్‌ దర్శకత్వంలో రూపొందిన జెర్సీ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాని గతంలో ఏ చిత్రం చేయని బిజినెస్‌ ఈ చిత్రం చేసింది. దాదాపుగా 55 కోట్లకు పైగా బిజినెస్‌ చేసిన ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని దక్కించుకుంటుందనే నమ్మకం అందరిలో ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నిర్మానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు..

నాని 'జెర్సీ' టీంకు చుక్కలు కనిపిస్తున్నాయట.. కారణం 'మజిలీ'!-Majili Increasing Pressure On Nani Jersey Team

అయితే ఈ సమయంలోనే మజిలీ చిత్రం వల్ల జెర్సీ చిత్ర యూనిట్‌ సభ్యులు కాస్త ఆందోళనకు గురి అవుతున్నారు.

ఇటీవలే వచ్చిన నాగచైతన్య మరియు సమంతల ‘మజిలీ’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మజిలీ చిత్రం క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. ఆ చిత్రం వచ్చిన రెండు వారాలకే అదే నేపథ్యం అంటే క్రికెట్‌ నేపథ్యంలో జెర్సీ రాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారనేది పెద్ద ప్రశ్నగా ఉంది.

మజిలీ ఇప్పటికే వచ్చి సూపర్‌ హిట్‌ మూవీగా నిలిచింది. అన్ని ఏరియాల్లో కలిపి 30 కోట్లకు పైగా రాబట్టింది. ఇలాంటి సమయంలో జెర్సీ వచ్చి ఆశించిన స్థాయిలో ఆకట్టుకుంటుందా, ప్రేక్షకుల అంచనాలకు రీచ్‌ అవుతుందా అంటున్నారు.

నాని సినీ కెరీర్‌లోనే ఇది విభిన్నమైన చిత్రంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చిత్రంలో నాని గెటప్‌తో పాటు, కాస్త ఏజ్‌ అయిన వ్యక్తిలా కనిపించబోతున్నాడు.

ఈ చిత్రంలో నానికి ఒక బాబు కూడా ఉంటాడు. తండ్రి, కొడుకుల సెంటిమెంట్‌ నేపథ్యంలో ఈ చిత్రంలో ఉండే సీన్స్‌ ఆకట్టుకుంటాయని అంటున్నారు. మొత్తానికి మజిలీ చిత్రం విడుదలకు ముందు వరకు ఎలాంటి టెన్షన్‌ లేకుండా ఉన్న జెర్సీ టీం ఇప్పుడు మాత్రం కాస్త ఆందోళనకు గురవుతున్నట్లుగా అనిపిస్తుంది..

అయితే పైకి మాత్రం మజిలీతో మా సినిమాకు సంబంధం లేదన్నట్లుగా చెబుతున్నారు.