మణిరత్నంని కాపీ చేసిన శివ! మజిలీ కథకి అదే మూలమా  

కథల విషయంలో మణిరత్నంని ఫాలో అవుతున్న శివ నిర్వాణ.

Majili Director Shiva Nirvana Fallow The Mani Ratnam Movies-

టాలీవుడ్ ప్రస్తుతం వరుస రెండు క్లాసిక్ మూవీలతో క్లాసికల్ చిత్రాల దర్శకుడుగా శివ నిర్వాణ ముద్ర వేసుకున్నాడు.నిన్నుకోరి, మజిలీ సినిమాలతో వరుసగా రెండు సూపర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు శివ ఇప్పుడు ఊహించని విధంగా మరో నెగిటివ్ ట్యాగ్ ని తగిలించుకున్నాడు.

Majili Director Shiva Nirvana Fallow The Mani Ratnam Movies--Majili Director Shiva Nirvana Fallow The Mani Ratnam Movies-

టాలీవుడ్ లో కాపీ క్యాట్ దర్శకులు ఎక్కువ అనే ముద్ర ఇప్పటికే బలంగా నాటుకుపోయింది.

రాజమౌళి, త్రివిక్రమ్ లని ఎక్కువగా ఈ కోవలో చూస్తారు.వారి ప్రతి సినిమాలో ఏదో ఒక హాలీవుడ్ సినిమా చాయలు స్పష్టం గా కనిపిస్తాయి.

అయితే వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ ఉన్న ప్రస్తుతం వాళ్ళిద్దరూ టాలీవుడ్ లో స్టార్ దర్శకులుగా ఉన్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు శివ నిర్వాణ మీద కూడా అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నానితో తెరకెక్కించిన మొదటి సినిమా నిన్నుకోరే కూడా గతంలో వచ్చిన ఓ సినిమా స్ఫూర్తితోనే రాసుకున్నాడు అనే మాట వినిపించింది.

తాజాగా చైతు, సమంత జోడీగా నటించిన మజిలీ సినిమాని కూడా గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన మౌనరాగం స్పూర్తిగాతో రాసుకున్నాడని తెలుస్తుంది.అయితే క్యారెక్టర్స్ చేంజ్ చేసి స్టొరీ, స్క్రీన్ ప్లే లో ప్రెజెంట్ నేటివిటీకి కనెక్ట్ అయ్యే అంశాలు జోడించి తెరకెక్కించడం వలన యూత్ కి భాగా కనెక్ట్ అయ్యింది.

మరి ప్రస్తుతం శివ మీద వస్తున్నా ఈ నెగిటివ్ కామెంట్స్ పై అతను ఎలాంటి సమాధానం ఇస్తాడు అనేది చూడాలి.