ఆ రెస్టారెంట్లో రోబోనే వెయిటర్..రోబో చేస్తున్న సేవలకు ఫిదా

రెస్టారెంట్ అంటే ఓ ప్రశాంత ప్రదేశం అని అందరికీ తెలుసు.చాలా మంది ఏకాంతంగా మాట్లాడుకోవడానికి రెస్టారెంట్లకు వెళ్తుంటారు.

 Maira Talking Robot Hyderabad Restaurant-TeluguStop.com

రెస్టారెంట్ లో వెయిటర్ మనం ఏది కావాలని అడిగితే అది తెచ్చి పెడుతుంటాడు.అయితే కరోనా కేసులు పెరుగుతున్నటువంటి కాలంలో చాలా రెస్టారెంట్లు తమ వాటిల్లో రోబోలను పెట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.

కొన్ని రెస్టారెంట్లు అయితే ఇప్పటికే రోబోల సాయంతో తమ పనులను చకచకా చేసేసుకుంటున్నాయి.మన దేశంలో చూసినట్లైతే ఇప్పటికే కొన్ని ప్రధాన నగరాలలో రోబోటిక్ రెస్టారెంట్లు విజయవంతంగా సాగుతున్నాయి.

 Maira Talking Robot Hyderabad Restaurant-ఆ రెస్టారెంట్లో రోబోనే వెయిటర్..రోబో చేస్తున్న సేవలకు ఫిదా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మనకు దగ్గర్లోని హైదరాబాద్ నగరంలో ఓ రెస్టారెంట్ లో రోబో ప్రత్యక్షమయ్యింది.ఆ రోబో అక్కడ వెయిటర్ మాత్రమే కాకుండా దానికి మించి పనులు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.


రెస్టారెంట్లో అడుగుపెట్టే కస్టమర్లు వారు బయటకు వెళ్లే వరకూ కూడా వారికి ఏం కావాలంటే అది తెచ్చిపెడుతూ రోబోలు పుల్ బిజీగా ఉంటున్నాయి.హలో వెల్కం అని చెబుతూనే.ఆర్డర్ అనేది టేబుల్ మీదకి వచ్చేవరకు కస్టమర్లతో కబుర్లు చెబుతున్నాయి.కాసేపు వారితో జోక్స్ వేస్తూ సందడి చేస్తున్నాయి.ఆడవాళ్లతో ఆడవారిలాగా పిల్లలతో పిల్లల్లా వాయిస్ లు చేంజ్ చేసుకొని మరీ అవి ఆడుతూ పాడుతూ తమ పనులు చేస్తున్నాయి.అంతేకాదు ఆ రోబోలు ముఖకవళికలను కూడా మారుస్తు ఉంది.

హైదరాబాద్ లోని ఆ రోబో పేరే ‘ మైరా ‘ అని ఇప్పుడు అందరూ పిలుస్తున్నారు.హైద‌రాబాద్‌ నగరానికి చెందిన విస్టాన్‌ నెక్స్ట్‌జెన్ అనే సంస్థ దీనిని తయారు చేసింది.

మైరా రోబో పరిసరాలను చూసేవిధంగా వాటిని అనుభూతి చెందేవిధంగా దీనిని డిజైన్ చేశారు.అంతేకాదు కస్టమర్ల మాటలను అది విన‌గ‌లిగేలా ప్రోగ్రామ్ చేయబడి ఉంది.

దీంతో ఆ రోబో ప‌రిస‌రాల‌కు త‌గిన‌ట్లుగా మారిపోతుంది.ఇండియాలో ఇన్ని ప్ర‌త్యేక‌త‌లున్నటువంటి ప్రథమ రోబో ఇదేన‌ని దీనిని ఏర్పాటు చేసిన సంస్థ వ్యవస్థాపకుడు రామరాజు సింగం తెలియజేశారు.

#Robot Maira #RobotIn #MairaTalking

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు