గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అకౌంట్లోకి రాకపోవడానికి అసలు కారణం ఇదే...

మీడియా నివేదికల ప్రకారం… మే నెల 2020 నుండి ఎల్ పీ జీ గ్యాస్ సిలిండర్ల పై వస్తున్న సబ్సిడీ మొత్తం వినియోగదారుల బ్యాంక్ అకౌంట్ లోకి రావడం లేదు.ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు.

 Main Reason Of Not Get The Subsidy Of Lpg Gas Cylinder, Gas Cylinder, Bank Accou-TeluguStop.com

లేదంటే గమనించి ఉండక పోవచ్చు.అయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనిస్తే గత ఐదు నెలలుగా ఈ సబ్సిడీ మొత్తం తమ బ్యాంక్ అకౌంట్ లోకి రాకపోవడం గమనించవచ్చు.

ఈ నేపథ్యంలో బీజేపీ సారథ్యంలోని మోడీ ప్రభుత్వం సిలిండర్ పై వచ్చే సబ్సిడీ మొత్తం నిలిపి వేసింది అని వినియోగదారులు అపోహలకు గురి కావచ్చు.సబ్సిడీ డబ్బులు రాక పోవడానికి అసలు కారణం గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గిపోవడమే.

గత నెల కొంతమంది వినియోగ దారులకు మాత్రం 27 రూపాయలు మాత్రం సబ్సిడీ మొత్తంలో జమ అయింది.గ్యాస్ సిలిండర్ ధరలను క్రమంగా కేంద్ర ప్రభుత్వం తగ్గించుకుంటూ వస్తోంది.

దాంతో మార్కెట్లో సబ్సిడీ సిలిండర్ ధర, నాన్ సబ్సిడీ సిలిండర్ ధర దాదాపు సమానం అయ్యాయి.దీని కారణంగా వినియోగదారుల బ్యాంక్ అకౌంట్ లోకి సబ్సిడీ మొత్తం రాకపోవడం గమనించవచ్చు.

కేంద్ర ప్రభుత్వం సాధారణంగా సబ్సిడీ సిలిండర్ ధర కు, నాన్ సబ్సిడీ సిలిండర్ ధరకు మధ్య ఎంత మొత్తం వ్యత్యాసం ఉందో ఆ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలోకి సబ్సిడీ రూపంలో జమ చేసేది.అయితే ఇప్పుడు రెండు సమానం కావడంతో సబ్సిడీ రాకపోవడాన్ని గమనించవచ్చు.

అయితే ఇది తాత్కాలికమే .గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగితే మళ్లీ సబ్సిడీ వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube