విడ్డూరం : ఆడతోడు కోసం రెండు పులులు సాగించిన జర్నీ ప్రపంచాన్ని నివ్వెర పర్చుతోంది

మనిషి అయినా జంతువు అయినా తోడు ఉంటేనే జీవనం సాగిస్తుంది.ఒంటరి జీవనం ఎక్కువ కాలం సాగించడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు.

 Mail Tiger Travels For Lady Tiger To 1300 Km In 150 Days Two States 6 Districts-TeluguStop.com

ముఖ్యంగా మగ వారికి ఆడ తోడు, ఆడవారికి మగ తోడు అనేది ఖచ్చితంగా అవసరం.శృంగార జీవితంకే అని కాకుండా అన్ని విధాలుగా కూడా తోడు అనేది చాలా అవసరం.

మనుషుల్లోనే ఈ తోడు అవసరం అని చాలా మంది అనుకుంటారు.కాని జంతువులు కూడా తోడు కోసం ఎంతగా పరితపిస్తాయో తాజాగా అటవి శాఖ వారు విడుదల చేసిన ఒక డాక్యుమెంటరీతో వెళ్లడయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.తిపేశ్వర్‌ అడవికి చెందిన రెండు మగ పులులు ఆడ సాంగత్యం కోసం ఏకంగా రెండు రాష్ట్రాలను ఆరు ఏడు జిల్లాలను తిరిగేశాయట.2016 లో జన్మించిన ఈ పులులు ఆడ తోడు కోసం వెదకడం ప్రారంభించాయి.ఈ పులులకు చిన్న తనంలోనే అటవి శాఖ అధికారులు వీటి కదలికలను గమనించేందుకు వాటికి రేడియో కాలర్లు అమర్చారు.

వాటి ద్వారా ఆ పులల ప్రవర్తన మరియు వాటి యొక్క జర్నీని తెలుసుకున్నారు.

Telugu Mailtiger, Telugu Ups-

తిపేశ్వర్‌ అడవుల్లో ఆడ పులులు లేని కారణంగా వాటి జర్నీ ఆరు నెలల క్రితం ప్రారంభం అయ్యింది.అలా దాదాపుగా 150 రోజులు 1300 కిలోమీటర్లు ప్రయాణించి చివరకు మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాలోని అడవుల్లో ఆడ తోడును వెదుక్కున్నాయి.ఆడ తోడు లభించిన తర్వాత ఆ పులల జర్నీ ఆగిపోయింది.

చాలా రోజులుగా అక్కడే ఉంటున్నట్లుగా అటవి అధికారులు గుర్తించారు.మహారాష్ట్ర తెలంగాణలో ఆరు ఏడు జిల్లాలో ఈ పులుల జర్నీ కొనసాగింది.

Telugu Mailtiger, Telugu Ups-

ఈ క్రమంలో ఈ రెండు పులులు కూడా కనీసం ఏ ఒక్కరికి హాని చేయకుండా సాఫీగా ముందుకు వెళ్లాయి.ఆకలి వేసిన సమయంలో చిన్న చిన్న జంతువులను వేటాడి తింటూ ముందుకు వెళ్లాయి.ఆడ తోడు కోసం ఈ పులులు సాగించిన జర్నీపై నేషనల్‌ జియోగ్రఫీ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.ప్రస్తుతం ఈ విషయం అందరిని ఆశ్చర్యపర్చుతుంది.వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా ఇలాంటి జర్నీ నిజంగా సాగిందంటూ అటవి అధికారులు ఆధారాలతో సహా చూపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube