న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైన ప్రియదర్శి మూవీ

ఈ మధ్యకాలంలో తెలుగులో వస్తున్న చిన్న సినిమాలు మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటున్నాయి.దర్శకులు డిఫరెంట్ కంటెంట్ లతో తక్కువ బడ్జెట్ తో కథలు సిద్ధం చేసుకొని తెరపై అంతే అందంగా ఆవిష్కరించి హిట్స్ కొడుతున్నారు.

 Mail Gets Selected For The New York Indian Film Festival-TeluguStop.com

పెద్ద హీరోలతో ప్రయోగాలు కష్టం ఏమో కాని, కొత్త వాళ్ళతో ప్రయోగాత్మక కథలే వర్క్ అవుట్ అవుతాయి.ఇంకా చెప్పాలంటే తెలుగులో ఫన్ ఎలిమెంట్ ఉన్న కథలకి ఎప్పుడూ కూడా డిమాండ్ ఉంటుంది.

ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని కొత్తగా, నేచురల్ గా చెప్పే ప్రయత్నం చేస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.జాతిరత్నాలు సినిమాతో మరోసారి ఈ ఫన్ జోనర్ కి టాలీవుడ్ లో ఎంత డిమాండ్ ఉందో రుజువైంది.

 Mail Gets Selected For The New York Indian Film Festival-న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికైన ప్రియదర్శి మూవీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలా నేచురల్ గా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఓ ముగ్గురు కుర్రాళ్ళ కథతో అవుట్ అండ్ అవుట్ ఫన్ తో దర్శకుడు అనుదీప్ కథని చెప్పిన విధానం ఆడియన్స్ కి నచ్చడంతో విపరీతంగా చూసేశారు.దీంతో సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రియదర్శి కూడా మంచి పాత్రలో మెప్పించాడు.

ఇక కమెడియన్స్ ప్రియదర్శి దీనికంటే ముందుగా మెయిల్ అనే వెబ్ ఫిల్మ్ తో డిజిటల్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

కంబాలపల్లి కథలు అనే వెబ్ ఫిలిం సిరీస్ లో మొదటి భాగంగా మెయిల్ చాప్టర్ 1 రిలీజ్ అయ్యింది.కంబాలపల్లి గ్రామంలో కంప్యూటర్ వచ్చే కొత్తలో జరిగిన కథగా దీనిని తెరపై ఆవిష్కరించారు.

కంప్యూటర్ ఓనర్ గా ప్రియదర్శి నటించగా అతని దగ్గర కంప్యూటర్ నేర్చుకోవాలనే కుతూహలంతో మెయిల్ ఓపెన్ చేసి సైబర్ మోసానికి గురయ్యి డబ్బులు పోగొట్టుకున్న యువకుడు పాత్రలో హర్షిత్ మెరిసాడు.ఈ వెబ్ ఫిల్మ్ చాలా సింపుల్ గా మంచి హ్యూమర్ క్రియేట్ చేసింది.

దీంతో ఉదయ గుర్రాల దర్శకుడుగా పరిచయం అయ్యాడు.తాజాగా ఈ వెబ్ ఫిల్మ్ కి అరుదైన గౌరవం దక్కింది.

న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కి మెయిల్ వెబ్ ఫిల్మ్ ఎంపికైంది.మరి అక్కడ ఎలాంటి ఎలాంటి గుర్తింపుని దక్కించుకుంటుందో చూడాలి.

#NewYork #Priyadarshi #Aha OTT

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు