భారతీయ మహిళ దారుణహత్య .. పనిమనిషికి జీవితఖైదు, సింగపూర్‌ కోర్ట్ సంచలన తీర్పు

Maid Sentenced To Life Imprisonment For Murdering Elderly Indian Woman In Singapore , Singapore, Myanmar, Jin Mar Nwi, Indian Woman, Life Imprisonment , Maid

యజమానికి నమ్మకంగా వుంటూ పనిచేసుకోవాల్సిందిపోయి.ఓ పనిమనిషి తన ఓనర్‌ అత్తగారిని దారుణంగా హత్య చేసింది.

 Maid Sentenced To Life Imprisonment For Murdering Elderly Indian Woman In Singap-TeluguStop.com

ఈ కేసులో మయన్మార్‌కు( Myanmar ) చెందిన యువతికి సింగపూర్ కోర్ట్ జీవితఖైదు విధించింది.వివరాల్లోకి వెళితే.2018 జనవరిలో సింగపూర్‌లో స్థిరపడిన ఓ భారత సంతతి మహిళ ఇంట్లో పని చేయడానికి వచ్చింది మయన్మార్‌కు చెందిన 22 ఏళ్ల జిన్ మార్ న్వీ( Jin Mar Nwi ).అయితే ఆ ఇంటి ఓనర్‌ అత్తగారు తరచూ ఆమెను వేధిస్తుండటం.తిరిగి మయన్మార్‌కు పంపుతానని బెదిరింపులకు పాల్పడుతూ వుండటంతో జిన్ మార్ ఆ వృద్ధురాలిని హత్య చేసింది.

Telugu Indian, Jin Mar Nwi, Maid, Maidsentenced, Myanmar, Singapore-Telugu NRI

జూన్ 25, 2018న జిన్ కిచెన్‌లోంచి కత్తిని తీసుకొచ్చి వృద్ధురాలిని విచక్షణారహితంగా పొడిచింది.ఆపై ఇంట్లోంచి కొంత నగదు తీసుకుని తనను పనిలో పెట్టిన ఏజెన్సీ వద్దకు వెళ్లి పాస్‌పోర్ట్ అడిగింది.జిన్ ప్రవర్తనపై అక్కడి సిబ్బందికి అనుమానం రావడంతో మీ యజమాని అనుమతి ఇస్తేనే పాస్‌పోర్ట్ ఇస్తామని కరాకండీగా చెప్పారు.

దీంతో భయడిపన జిన్ కొద్దిగంటల పాటు వూరంతా తిరిగి మరోసారి ఏజెన్సీ వద్దకు వెళ్లింది.దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో జిన్ మార్‌ను అరెస్ట్ చేశారు.

పోస్ట్‌మార్టం నివేదికలో వృద్ధురాలి శరీరంపై దాదాపు 26 కత్తిపోట్లు వున్నట్లు పోలీసులు తెలిపారు.

Telugu Indian, Jin Mar Nwi, Maid, Maidsentenced, Myanmar, Singapore-Telugu NRI

విచారణ సందర్భంగా తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని జిన్ బుకాయించే ప్రయత్నం చేసింది.అయితే పోలీసులు గట్టి ఆధారాలు చూపించేసరికి నేరాన్ని అంగీకరించింది.మృతురాలు తనను శారీరకంగా, మానసికంగా వేధించిందని జూలై 1, 2018న పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిందితురాలు తెలిపింది.

తనను అసభ్యపదజాలంతో పలుమార్లు దూషించిందని పేర్కొంది.బాధితురాలు మే 26, 2018న తన యజమాని కుటుంబంతో కలిసి వుండేందుకు సింగపూర్ వచ్చిందని చెప్పింది.

తన తల, వీపుపై ఆమె పలుమార్లు పిడిగుద్దులు కొట్టిందని పేర్కొంది.ఓ రోజు మసాజ్ చేస్తుండగా అది ఆమెకు నచ్చకపోవడంతో తనను చెంపపై కొట్టిందని చెప్పింది.

అయితే నేరం జరిగిన రోజున నిందితురాలి మానసిక పరిస్ధితి బాలేదని ఆమె తరపు న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది.బాధితురాలిని కత్తితో పొడిచినప్పుడు నిందితురాలు స్పృహలోనే వుందని, కత్తిపోట్లకు సంబంధించిన వివరాలు ఆమెకు గుర్తున్నాయని అందుకే పోలీసులకు చెప్పగలిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube