హీరోయిన్స్ అంటే హై క్లాస్ వేశ్యలు.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు?

సినిమాల్లో హీరోయిన్లుగా నటించే వాళ్లపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి.ప్రముఖ నటి మహికా శర్మ తాజాగా సినిమా ఇండస్ట్రీ గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Mahika Sharma Heroines Are Upper Class Prostitutes Not All Wrong Young Actress Emotional Comments-TeluguStop.com

ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో మహిళలను ఎప్పుడూ లైంగిక వస్తువులుగా చూస్తారని ఆమె పేర్కొన్నారు.సినిమా రంగంలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ మహికా శర్మ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న మహికా శర్మ హీరోయిన్లు అంటే హై క్లాస్ వేశ్యలని చేసిన కామెంట్లు బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా చర్చనీయాంశం అయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా వ్యభిచారం జరుగుతోందని అయితే అందరి దృష్టి హీరోయిన్లపై మాత్రమే ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

 Mahika Sharma Heroines Are Upper Class Prostitutes Not All Wrong Young Actress Emotional Comments-హీరోయిన్స్ అంటే హై క్లాస్ వేశ్యలు.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ రంగంలో అతి చేసేవాళ్లు ఎక్కువగా ఉంటారని ఆమె పేర్కొన్నారు.

Telugu High Class Prostitutes, Mahika Sharma, Sensational Comments, Young Actress-Movie

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఇండస్ట్రీ అని తన సినీ కెరీర్ లో తనకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఆమె చెప్పుకొచ్చారు.సినిమా హీరోయిన్లకు ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంటుందని అయితే ప్రేక్షకుల్లో హీరోయిన్లకు గౌరవం మాత్రం లేదని వెల్లడించారు.

సినిమాల్లో అవకాశాల కొరకు కొంతమంది డైరెక్టర్లకు లేదా నిర్మాతలకు బలి అవుతరని మహికా శర్మ అన్నారు.సమాజంలో కూడా హీరోయిన్లను వేరే కోణంలో చూస్తారని ఆమె చెప్పుకొచ్చారు.

త్వరలో మహికా శర్మ నటించిన ది మోడ్రన్ కల్చర్ రిలీజ్ కానుంది.అయితే తన సినిమాపై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే నటి ఈ విధంగా కామెంట్లు చేసి ఉండవచ్చని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

మహికా శర్మ కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

#Young Actress #Comments #Mahika Sharma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు