గ్యాంగ్‌స్టర్‌పై పడ్డ తెలుగు డైరెక్టర్.. మామూలుగా ఉండదట!  

Mahi V Raghava To Direct Web Series On Dawood Ibrahim, Mahi V Raghava, Allu Arjun, Dawood Ibrahim, Web Series, Tollywood News - Telugu Allu Arjun, Dawood Ibrahim, Mahi V Raghava, Tollywood News, Web Series

ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా ఎక్కువగా ఉండటంతో స్టార్స్ అందరూ వాటిపై ఫోకస్ పెడుతున్నారు.స్టార్ డైరెక్టర్స్ నుండి స్టార్ హీరోల వరకు ఈ వెబ్ సిరీస్‌లవైపు ఆసక్తి చూపుతున్నారు.

 Mahi V Raghava To Direct Web Series On Dawood Ibrahim

అయితే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌ల కోసం ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ మహి వి రాఘవ కూడా క్యూ కడుతున్నాడు.తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ స్క్రిప్టును ఆయన రెడీ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అండర్‌వరల్డ్ డాన్‌గా ప్రపంచాన్ని గడగడలాడించిన దావూద్ ఇబ్రహీం జీవితం ఆధారంగా ఓ అదిరిపోయే క్రైమ్ కంటెంట్‌ను రెడీ చేశాడట.ఈ కథను వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తే ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని ఆయన అంటున్నాడు.

గ్యాంగ్‌స్టర్‌పై పడ్డ తెలుగు డైరెక్టర్.. మామూలుగా ఉండదట-Gossips-Telugu Tollywood Photo Image

ఇక ఈ వెబ్ సిరీస్‌తో తన సత్తాను చాటుకోవాలని చూస్తున్న మహి వి రాఘవ, అటు సినిమాల్లోనూ తన ప్రత్యేకతను చాటేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే యాత్ర చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ డైరెక్టర్, ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఓ స్టోరీలైన్ కూడా వినిపించాడట ఈ డైరెక్టర్.పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనుండగా, ఇందులో బన్నీ యంగ్ సీఎం పాత్రలో నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరి అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ కథను వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తే ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో చూడాలి.ఏదేమైనా ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

#Dawood Ibrahim #Web Series #Allu Arjun #Mahi V Raghava

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mahi V Raghava To Direct Web Series On Dawood Ibrahim Related Telugu News,Photos/Pics,Images..