శ్రద్ధాదాస్ లీడ్ తో పొలిటికల్ సెటైర్ మూవీ మొదలు పెట్టిన యాత్ర దర్శకుడు

పాఠశాల అనే సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యి ఆనందో బ్రహ్మతో దర్శకుడుగా టర్న్ తీసుకొని హిట్ కొట్టిన వ్యక్తి మహి వి రాఘవ.ఆ తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపధ్యంలో యాత్ర టైటిల్ తో మమ్ముట్టి లీడ్ రోల్ లో సినిమా చేసి మహి వి రాఘవ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

 Mahi V Raghava Political Satirical Movie With Shradha Das-TeluguStop.com

ఈ సినిమాతో తాను వైఎస్ఆర్ అభిమాని అనే విషయాన్ని కూడా దర్శకుడు మహి వి రాఘవ రివీల్ చేయడంతో పాటు యాత్రకి సీక్వెల్ గా జగన్ పాదయాత్ర నేపధ్యంలో సినిమా చేస్తానని ప్రకటించాడు.అయితే అది ఎంత వరకు వచ్చిందనేది ఇంకా తెలియదు.

ఆ మధ్యలో కోలీవుడ్ హీరో సూర్య లీడ్ గా యాత్ర 2 స్టార్ట్ చేస్తాడని టాక్ వచ్చింది.తరువాత అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది.

 Mahi V Raghava Political Satirical Movie With Shradha Das-శ్రద్ధాదాస్ లీడ్ తో పొలిటికల్ సెటైర్ మూవీ మొదలు పెట్టిన యాత్ర దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే రీసెంట్ గా హీరో నితిన్ తో మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేసినట్లు అన్నదమ్ములైన ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ కథతో ఆ సినిమా ఉండబోతుందని టాక్ వచ్చింది.అయితే ఊహించని విధంగా ఇప్పుడు మహి వి రాఘవ అవుట్డేటెడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ లీడ్ లో ఓ పొలిటికల్ సెటైరికల్ మూవీని తక్కువ బడ్జెట్ తో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రీప్రొడక్షన్ దశలో ఉందని, కరోనా సెకండ్ వేవ్ సిచువేషన్ చూసుకొని దీనిని స్టార్ట్ చేసి వీలైనంత వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం.అలాగే టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న కమెడియన్స్ లో చాలా మంది ఇందులో కనిపించబోతున్నారని తెలుస్తుంది.

ఏపీ రాజకీయాల నేపధ్యంలోనే ఈ పొలిటికల్ సెటైరికల్ సినిమా ప్రెజెంట్ నేటివిటీకి సింక్ చేసే విధంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.

#Mahi Raghava #Ys Rajasekhar #Shradha Das #Yatra #Shraddha Das

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు