అర్థరాత్రి ఒంటరిగా వెళ్లొచ్చిన మహేశ్వరిని ఆర్జీవీ ఎంత మోసం చేశాడో తెలుసా?

మహేశ్వరి.అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబ సభ్యురాలిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన నటీమణి.చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది.90వ దశకంలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నటిగా గుర్తింపు తెచ్చుకుంది.క్రిష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన గులాబీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ అమ్మడు.రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఓ రేంజిలో సక్సెస్ అందుకుంది.

 Maheswari About Rgv Movie Details, Maheshwari, Actress Maheshwari, Ram Gopal Varma, Deyyammovie, Alitho Saradaga, Gulabi Movie, Director Krishna Vamshi, Sri Devi-TeluguStop.com

కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది ఈ సినిమా.ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.

మేఘాలలో, ఈవేళలో నీవు.అనే పాటలు జనాల నోటి వెంట ఇప్పటికీ వినిపిస్తుంటాయి.

 Maheswari About Rgv Movie Details, Maheshwari, Actress Maheshwari, Ram Gopal Varma, Deyyammovie, Alitho Saradaga, Gulabi Movie, Director Krishna Vamshi, Sri Devi-అర్థరాత్రి ఒంటరిగా వెళ్లొచ్చిన మహేశ్వరిని ఆర్జీవీ ఎంత మోసం చేశాడో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ్యూజికల్ గా కూడా అద్భుత విజయాన్ని అందుకుంది ఈ సినిమా.

తాజాగా అలనాటి బ్యూటీ మహేశ్వరి.

అలీతో సరదాగా అనే షోలో పాల్గొంది.ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

మాటల్లో మాటగా ఆర్జీవీ తనకు 50 వేల రూపాయలు అప్పున్న విషయాన్ని వెల్లడించింది.ఇంతకీ 50 వేల సంగతేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అప్పట్లో దెయ్యం సినిమా షూటింగ్ మేడ్చల్ లోని ఓ పాడుపడ్డ ఫామ్ హౌస్ లో చేశారు.అక్కడ స్మశానం సెట్ వేశారు.

ఆ ప్రాంతం అంతా పెద్ద చెట్లతో భయంకరంగా ఉంటుంది.అక్కడి నుంచి మెయిన్ రోడ్డు సుమారు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

రాత్రి ఒంటిగంటకు షూటింగ్.అప్పుడు వర్మ ఓ పందెం పెట్టాడు.ఎవరైతే ఆ రాత్రి మెయిన్ రోడ్డు వరకు ఒంటరిగా వెళ్లొస్తారో వారికి 50 వేలు ఇస్తానని చెప్తాడు.అయితే మహేశ్వరి భయపడుతూ వెళ్లి వచ్చింది.కానీ ఆయన ఇస్తానన్న డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదని చెప్పింది.

ఇప్పటికీ ఆర్జీవీ ఎక్కడ కనిపించినా.50 వేలు ఎప్పుడు ఇస్తావ్? అని అడుగుతానని వెల్లడించింది.ఇప్పటికైనా మహేశ్వరికి ఆ డబ్బు ఇవ్వాలని అలీ ఆర్జీవీకి ఈ షో ద్వారా వెల్లడించాడు.

లేదంటే ఇంటికి వచ్చి తీసుకుంటామన్నాడు.ఈ షోలో తన సినిమాలతో పాటు తన కుటుంబం గురించి కూడా పలు విషయాలను వెల్లడించింది.

Maheswari About Rgv Movie Details, Maheshwari, Actress Maheshwari, Ram Gopal Varma, Deyyammovie, Alitho Saradaga, Gulabi Movie, Director Krishna Vamshi, Sri Devi - Telugu Alitho Saradaga, Deyyam, Krishna Vamshi, Gulabi, Mahwswari, Ram Gopal Varma, Sri Devi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube