త్రివిక్రమ్ సినిమా పై మహేష్ షాకింగ్ కామెంట్స్.. మా సినిమా మామూలుగా ఉండదంటూ?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.ఈయన సినిమాలలో డైలాగ్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే.

 Maheshs Shocking Comments On Trivikrams Movie Saying That Our Movie Will Not Be-TeluguStop.com

ఇలా మాటల మాంత్రికుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే సినిమాలు కూడా అదే విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం మనం చూస్తున్నాము.

ఇకపోతే ఈయన తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని ముఖ్యంగా ఆయన సినిమాలో డైలాగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయని ఆ డైలాగ్స్ నాకు చాలా నచ్చుతాయని మహేష్ బాబు తెలిపారు.

ఇకపోతే తన కోసం మహేష్ బాబు ఒక డిఫరెంట్ కథను సిద్ధం చేసుకున్నారని ఇప్పటివరకు అలాంటి సినిమాని నేను కానీ త్రివిక్రమ్ కాని చేసి ఉండరు అంటూ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రాబోయే తన సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

Telugu Anushka, Khaleja, Mahesh Babu, Tollywood, Trivikram-Movie

ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 12 సంవత్సరాల క్రితం ఖలేజా వంటి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా థియేటర్లో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయినా ఇప్పటికి బుల్లితెరపై ప్రసారం అయితే మాత్రం ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తారు.ఈ విధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా సినిమాలు తర్వాత ఈ సినిమా రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube