సరిలేరు నీకెవ్వరు నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్  

Mahesh\'s \'sarileru Neekevvaru\' Second -mahesh\\'s,tollywood,vijayasanthi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ సరిలేరు నీకెవ్వరు.సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

Mahesh\'s \'sarileru Neekevvaru\' Second -mahesh\\'s,tollywood,vijayasanthi Telugu Tollywood Movie Cinema Film Latest News Mahesh\'s \'sarileru Neekevvaru\' Second -mahesh\-Mahesh's 'Sarileru Neekevvaru' Second Song-Mahesh\\'s Tollywood Vijayasanthi

ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఫస్ట్ సాంగ్ రిలీజై సోషల్ మీడియాలో లక్షల వ్యూస్ సంపాదించాయి.అనిల్ రావిపూడి తనకి అలవాటైన జోనర్ లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తీర్చిదిద్దినట్లు టీజర్ తో ఇప్పటికే అర్థమైంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయశాంతి చాలా సంవత్సరాల తర్వాత మరోసారి తెరపై కనిపించబోతోంది.దీంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.  ఇక తాజాగా సినిమాలో నుంచి సూర్యుడివో… చంద్రుడివో అంటూ సాగే రెండో సాంగ్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు.ఫ్యామిలీ మెలోడీగా సాగే ఈ సాంగ్ రిలీజ్ చేసిన కొద్ది సేపట్లోనే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్ ని రామజోగయ్యశాస్త్రి రాశారు.ఇక ప్రముఖ పంజాబీ సింగర్ బి ప్రాక్ గాయకుడిగా సౌత్ ఈ సాంగ్ తో తన ప్రస్థానం మొదలు పెడుతున్నాడు.

ఇప్పటికే ఈ సాంగ్ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.మరి మహేష్ ఈ సాంగ్ తో ఏ రేంజ్ లో తన స్టామినాను చూపిస్తాడు అనేది చూడాలి.

తాజా వార్తలు