మహేష్‌ ఓకే చెప్పక పోవడంతో బాలీవుడ్‌కు వెళ్లిన కథ  

Mahesh Babu Movie Line Goes Bollywood For Ranbir Kapoor-kabeer Singh Movie Director,mahesh Babu,ranbir Kapoor,telugu Tollywood Box Office

‘అర్జున్‌ రెడ్డి’ వంటి ట్రెండ్‌ సెట్టింగ్‌ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగ.ఈయన కేవలం తెలుగు ఆడియన్స్‌ను మాత్రమే కాకుండా ఉత్తరాదిన అందరు సినీ అభిమానులను తన అర్జున్‌ రెడ్డి హిందీ వర్షన్‌ కబీర్‌ సింగ్‌తో మెప్పించాడు.

Mahesh Babu Movie Line Goes Bollywood For Ranbir Kapoor-Kabeer Singh Director Mahesh Ranbir Kapoor Telugu Tollywood Box Office

దాదాపుగా 300 కోట్ల వరకు ఆ చిత్రం రాబట్టింది.ఇప్పుడు సందీప్‌ బాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ దర్శకుడు అయ్యాడు.

అక్కడ ఈయనతో సినిమాలు చేసేందుకు యంగ్‌ దర్శకులు క్యూ కడుతున్నారు.బడ్జెట్‌ విషయం మరియు పారితోషికం విషయంలో పూర్తి స్వేచ్చ ఇచ్చేందుకు కూడా నిర్మాతలు సిద్దంగా ఉన్నారు.

Mahesh Babu Movie Line Goes Bollywood For Ranbir Kapoor-Kabeer Singh Director Mahesh Ranbir Kapoor Telugu Tollywood Box Office

  కబీర్‌ సింగ్‌ చిత్రంతో వచ్చిన క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు సందీప్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.అర్జున్‌ రెడ్డి విడుదలైన వెంటనే మహేష్‌బాబుతో సినిమా చేయాలని సందీప్‌ కోరుకున్నాడు.

అందుకోసం ఒక స్టోరీ లైన్‌ను మహేష్‌కు చెప్పడం, అందుకు మహేష్‌ ఓకే అనడం జరిగి పోయింది.ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ముందుకు సాగలేదు.

ఆ స్టోరీ లైన్‌కు స్క్రిప్ట్‌ సిద్దం చేసినా కూడా మహేష్‌ వినలేదు.ఇప్పుడు ఆ స్క్రిప్ట్‌తో దర్శకుడు సందీప్‌ బాలీవుడ్‌ చెక్కేసినట్లుగా సమాచారం అందుతోంది.

 

బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణబీర్‌ కపూర్‌తో సందీప్‌ మరో సినిమాను చేయబోతున్నాడు.వీరిద్దరి కాంబోలో వచ్చిన కబీర్‌ సింగ్‌ సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో మరోసారి వీరిద్దరు కలిసి వర్క్‌ చేయబోతున్నారు.

మహేష్‌బాబు కోసం అనుకున్న కథను రణబీర్‌ కపూర్‌తో చేసేందుకు సందీప్‌ సిద్దం అయ్యాడు.ఇప్పటికే కథకు రణబీర్‌ ఓకే చెప్పడంతో పాటు, ఆ పాత్రకు తగ్గట్లుగా మారేందుకు సిద్దం అవుతున్నాడు.

సందీప్‌ రెడ్డి తనకు మరో హిట్‌ను ఇస్తాడనే నమ్మకంతో రణబీర్‌ ఉన్నాడు.మహేష్‌ మెచ్చిన ఆ స్టోరీ లైన్‌ ఏంటీ, హిందీలో ఆ సినిమా ఏ మేరకు నడుస్తుంది అనేది తెలియాలి అంటే వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సిందే.

తాజా వార్తలు

Mahesh Babu Movie Line Goes Bollywood For Ranbir Kapoor-kabeer Singh Movie Director,mahesh Babu,ranbir Kapoor,telugu Tollywood Box Office Related....