సందర్బం లేకుండానే ట్రెండింగ్ లో మహేష్‌...!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అభిమానులు సోషల్‌ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు.నేడు మహేష్‌ బాబుకు సంబంధించిన ఎలాంటి స్పెషల్‌ లేదు.

 Maheshbabu Hash Tag Trend In Twitter-TeluguStop.com

అయినా కూడా నేడు మహేష్ బాబు అభిమానులు మహేష్‌ మానియా బిగిన్స్ అనే హ్యాష్‌ ను సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేశారు.ప్రతి ఒక్కరు కూడా నేడు మహేష్‌ బాబు గురించిన విషేశాలను షేర్‌ చేసుకుంటూ ఆయన తదుపరి సినిమాలకు సంబంధించిన విషేశాలను చర్చించుకుంటూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.

పది రోజుల్లో మహేష్‌ బాబు పుట్టిన రోజు రాబోతుంది.ఆ పుట్టిన రోజు కు సంబంధించిన అప్‌ డేట్స్ ను సర్కారు వారి పాట చిత్ర యూనిట్‌ సభ్యులు రెడీ చేస్తున్నారు.అందుకు సంబంధించిన చర్చనే నేడు జరిగింది.పెద్ద ఎత్తున మహేష్‌ బాబు సినిమా ట్రెడ్డింగ్ అయ్యింది.

 Maheshbabu Hash Tag Trend In Twitter-సందర్బం లేకుండానే ట్రెండింగ్ లో మహేష్‌…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సర్కారు వారి పాట నుండి వచ్చే నెల మహేష్‌ బాబు బర్త్‌ డే సందర్బంగా పాటను విడుదల చేయాలని ఇప్పటికే నిర్ణయించారనే వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ను శరవేగంగా జరుపుతున్నారు.ఇకపై సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు కంటిన్యూస్ గా షూటింగ్‌ చేస్తారట.షూటింగ్‌ కు సంబంధించిన అప్ డేట్‌ ఏమీ లేదు.కాని పాట ను మాత్రం విడుదల చేస్తామని థమన్‌ అంటున్నాడు.మొదటి పాటను వీర మాస్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్యూన్‌ చేశాను అంటూ చెబుతున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న సర్కారు వారి పాట సినిమా లో మొదటి పాట ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బర్త్‌ డే సందర్బంగా టీజర్ విడుదల చేయాలని మొదట అనుకున్నా కూడా పాట ను విడుదల చేయడం వల్ల ప్రమోషన్‌ ఎక్కువ దక్కుతుందని.

సినిమా విడుదల ఇంకా చాలా సమయం ఉంది కనుక ఇప్పటి నుండే టీజర్‌ విడుదల చేయడం మంచిది కాదని కూడా అనుకుంటున్నారు.సినిమా ను సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్ లో షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టి త్రివిక్రమ్‌ సినిమా షూట్‌ లో మహేష్‌ జాయిన్ అవుతాడట.

#SarkaruVaari #MaheshBabu #MaheshBabu #Twitter #MaheshMania

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు