ఫొటోతో పరశురామ్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మహేష్..పిక్ వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమాను పరుశురామ్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

 Mahesh Wishes Director Parasuram Details, Mahesh Babu, Parasuram,hbd Director Pa-TeluguStop.com

ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.సర్కారు వారి పాట సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు.

ఆ తర్వాత సర్కారు వారి పాట సినిమాను వచ్చే ఏడాది 2022 ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.ఇది పక్కన పెడితే తాజాగా డైరెక్టర్ పరశురామ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు స్పెషల్ గా విషెస్ చెప్పాడు.

నిన్న డైరెక్టర్ పరశురామ్ పుట్టిన రోజు సందర్భంగా సర్కారు వారి పాట నుండి ఒక ఫోటోను షేర్ చేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.

ఈ ఫొటోలో మహేష్ బాబు తో పాటు పరశురామ్ షూటింగ్ సమయంలో ఉన్న ఫోటోను షేర్ చేసాడు.

ఈ ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.

ఇందులో మహేష్ బాబు హ్యాండ్సమ్ లుక్ లో అదిరి పోయాడు.మహేష్ పోస్ట్ చేస్తూ.ప్రతిభావంతుడైన డైరెక్టర్ పరశురామ్ ఎప్పుడు మంచి ఆరోగ్యంగా మరియు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను… అంటూ పరశురామ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.

ఈ ఫోటోలో మహేష్ బాబు పింక్ కలర్ షర్ట్ లో మరింత యంగ్ లుక్ లో నవ్వుతు కనిపిస్తున్నాడు.ఈ ఫోటో చూస్తున్న అభిమానులకు మహేష్ రోజురోజుకూ మరింత యంగ్ గా మారిపోతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రెజెంట్ మహేష్ బాబు సర్జరీ చేయించుకున్న కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

జనవరిలో ఈ సినిమా షూటింగ్ తిరిగి స్టార్ట్ అవ్వబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube