ఈవారం మహేష్‌ పోవడం ఖాయం, ఎందుకంటే

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ఉన్న కంటెస్టెంట్స్‌లో అధిక ఫాలోయింగ్‌ ఉన్నది శ్రీముఖికి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆమెకు ఫ్యాన్స్‌ సపోర్ట్‌తో పాటు బిగ్‌బాస్‌ డైరెక్టర్స్‌ సపోర్ట్‌ కూడా ఉంది.

 Mahesh Will Benextperson For Goingoutfrom The House-TeluguStop.com

అందుకే ఆమె ఫైనల్‌ విజేత అంటూ ముందు నుండే ప్రచారం జరుగుతోంది.ఇక శ్రీముఖి ఫ్యాన్స్‌ తలుచుకుంటే ఎవరినైనా ఎలిమినేట్‌ చేయగలరు అంటూ ఆమె ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈవారం వారు అంతా అనుకుని మరీ మహేష్‌ విట్టాను ఎలిమినేట్‌ చేయబోతున్నారు.

Telugu Ali Reza, Mahesh Vitta, Rahul Sipligunj, Siva Jyothi, Srimukhi, Vithika-

  ఈ వారంలో వరుణ్‌, రాహుల్‌ మరియు మహేష్‌ విట్టాలు ఎలిమినేషన్‌లో ఉన్నారు.ఈ ముగ్గురిలోకి మహేష్‌ విట్టా వీక్‌గా కనిపిస్తున్నాడు.పైగా అతడు గత కొన్నాళ్లుగా ముచ్చట్లు మరీ ఎక్కువ అయ్యాయి.

ఇంట్లో రెండు గ్రూపులు ఉంటే అక్కడి ముచ్చట్లు ఇక్కడ, ఇక్కడ ముచ్చట్లు అక్కడ చెబుతున్నాడు.దాంతో ఇంట్లో సభ్యుల మద్య గ్యాప్‌ పెరుగుతుంది.

అందుకే మహేష్‌పై ప్రేక్షకుల్లో కూడా కోపం ఉంది.అందుకే ఈ వారం ఆయనుకు ప్రేక్షకులు ఓట్లు వేయడం కష్టమే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Ali Reza, Mahesh Vitta, Rahul Sipligunj, Siva Jyothi, Srimukhi, Vithika-

 ప్రస్తుతం ఇంట్లో ముగ్గురు లేడీస్‌ శ్రీముఖి, వితిక మరియు శివ జ్యోతిలు ఉన్నారు.అయిదుగురు మగవారు బాబా, అలీ, వరుణ్‌, మహేష్‌, రాహుల్‌లు ఉన్నారు.ఈ ఎనిమిది మందిలో ఈ వారం మహేష్‌ పోతే మరో ఏడుగురు ఉంటారు.ఆ ఏడుగురిలో రెండు వారాలకు ఒక్కొక్కరి చొప్పున ఎలిమినేట్‌ అయితే మిగిలే చివరి అయిదుగురు ఫైనల్‌ వీక్‌కు వెళ్తారు.

ఆ అయిదుగురిలో ఒకరు ఫైనల్‌ విన్నర్‌ అవుతారు.మరో మూడు వారాల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ముగింపు ఎపిసోడ్స్‌ ప్రసారం కాబోతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube