ఇందిరా దేవిని తలచుకుంటూ ఎమోషనల్ అయిన నమ్రత.. ఏమన్నారంటే?

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్య సమస్యల వల్ల రెండు రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే.ఇందిరా దేవి మరణం ఆమె కుటుంబ సభ్యులను ఎంతగానో బాధపెట్టింది.

 Mahesh Wife Namrata Emotional Post About Indira Devi Details Here , Namrata, Mah-TeluguStop.com

సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఇందిరా దేవి మృతికి సంతాపం తెలియజేశారు.ఇందిరా దేవి మరణం మహేష్ భార్య నమ్రతను ఎంతగానో బాధ పెట్టింది.

తాజాగా నమ్రత సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.నమ్రత తన పోస్ట్ లో మేము మిమల్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉంటామని అన్నారు.

 Mahesh Wife Namrata Emotional Post About Indira Devi Details Here , Namrata, Mah-TeluguStop.com

మీరు నాకు పంచిన ప్రేమను నా కుటుంబ సభ్యులందరిపై చూపిస్తానని నమ్రత చెప్పుకొచ్చారు.వీ లవ్ యూ అంటూ నమ్రత చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్ట్ ను చూసిన చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నమ్రతకు ధైర్యం చెబుతుండటం గమనార్హం.ఇందిరా దేవి లేని లోటు ఎవరూ తీర్చలేనిది.

.ధైర్యంగా ఉండండి అంటూ కొంతమంది కామెంట్లు పెడుతూ నమ్రతను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.

నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ పోస్ట్ చేయడం గమనార్హం.నమ్రతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మహేష్ బాబుతో పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉన్నారు.నమ్రత కుటుంబానికే సమయం కేటాయించడంతో పాటు గౌతమ్, సితార సినిమాలలో, కెరీర్ విషయంలో సక్సెస్ కావడానికి తన వంతు కృషి చేస్తున్నారు.నమ్రత తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ఆమెను అభిమానించే అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.మహేష్ నమ్రత ప్రేమ వివాహం చేసుకోగా వయస్సులో నమ్రత మహేష్ కంటే పెద్ద అనే సంగతి తెలిసిందే

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube