ఉప్పెన మూవీ చూసిన మహేష్.. రియాక్షన్ ఏంటంటే..?- Mahesh Tweets About Latest Block Buster Hit Uppena Movie

mahesh tweets about latest block buster hit uppena movie,tollywood ,mahesh babu .sarkaru vari pata ,keerth suresh ,uppena movie .vishnav tej ,kruthi setty - Telugu Kruthishetty, Latest Block Buster Tweet, Mahesh, Uppena Movie, Vaishnav Tej

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్ తో ఊహించని స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఉప్పెన సినిమాను చూసి ప్రశంసించారు.

 Mahesh Tweets About Latest Block Buster Hit Uppena Movie-TeluguStop.com

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఉప్పెన సినిమాను చూసి ఆ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఉప్పెన సినిమా క్లాసిక్ అని మహేష్ బాబు పేర్కొన్నారు.

ఒక్క మాటలో ఉప్పెన సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా క్లాసిక్ అని ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు సానా అరుదైన కాలాతీతమైన మూవీని తెరకెక్కించారని మహేష్ అన్నారు.ఉప్పెన మూవీ గురించి ఈ విధంగా చెప్పడానికి తనకు ఎంతో గర్వంగా ఉందని మహేష్ పేర్కొన్నారు.

 Mahesh Tweets About Latest Block Buster Hit Uppena Movie-ఉప్పెన మూవీ చూసిన మహేష్.. రియాక్షన్ ఏంటంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ఎంతో ఇంపార్టెంట్ అని ఉప్పెన మూవీలో మ్యూజిక్ స్టోరీతో పోటీ పడే విధంగా ఉందని పేర్కొన్నారు.

ఉప్పెన మూవీలో హీరోహీరోయిన్లుగా నటించిన వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి అద్భుతంగా నటించారని హీరోహీరోయిన్ల నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని మహేష్ అన్నారు.ఉప్పెన, కృతి రియల్ స్టార్స్ అని మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ ఉప్పెన మూవీని నిర్మించినందుకు హ్యాట్సాఫ్ చెబుతున్నానని మహేష్ అన్నారు.ఉప్పెన మూవీ కోసం శ్రమించిన టీమ్ ను చూసి గర్వపడుతున్నానని తెలిపారు.

మరోవైపు మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తుండగా 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.త్వరలో గోవాలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు నటించనున్నారు.

#LatestBlock #Vaishnav Tej #Kruthishetty #Mahesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు