ఇలియానాను ఆపేసిన మహేష్

గోవా బ్యూటి ఇలియానా ఏం మాట్లాడిన సంచలనమే.ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది.

 Mahesh Tempted Ileana To Stay In The Industry-TeluguStop.com

కేరీర్ తొలినాళ్ళలో అసలు ఇండస్ట్రీలో ఉండకూడదు అనుకుందట.సినీప్రపంచాన్ని వదలేద్దాం అని డిసైడ్ చేసుకుందట.

మరి ఇలియానాను ఆపిందెవరు ?

ఇలియానా మొదటి చిత్రం దేవదాసు.నిజానికి ఈ సినిమా పూర్తిచేసిన వెంటనే సినిమాలా జోలికి వెళ్ళకూడదు అనుకుంది.

ఎందుకు అని అడిగితే ” నేను ఇక్కడ సంతోషంగా ఉండలేను అనిపించింది.ఒప్పుకున్న సినిమా పూర్తి చేసి వెళ్ళిపోదామనుకున్న.

కాని ఇంతలోనే పోకిరి కోసం నన్ను అనుకుంటున్నారని తెలిసింది, నమ్మలేదు, మహేష్ సరసన ఇంత త్వరగా అవకాశం ఎలా వస్తుంది అనుకున్నాను.కాని కల నిజమైనట్లు, మహేష్ లాంటి పెద్ద హీరోతో నటించే అవకాశం దొరికింది.

అంత పెద్ద సినిమా కాబట్టి వదులుకోలెను.సినిమా విడుదలైంది, భారి విజయాన్ని సాధించింది.

నాకు స్టార్ ఇమేజ్ వచ్చింది.ఆ తరువాత జనాలు నాకు గౌరవం ఇవ్వడం నేర్చుకున్నారు.

ఆ తరువాత వెనక్కి తిరిగి చూడలేదు ” అంటూ చెప్పుకొచ్చింది ఇల్లి బేబి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube