ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.సరిలేరు నీకెవ్వరూ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే అదే జోష్ లో సర్కారు వారి పాట సినిమా ప్రారంభించాడు.
ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి చేసుకుంది.
అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించాడు డైరెక్టర్.
తాజాగా ఉగాది రోజు హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ ప్రారంభించారు.
ఈ షెడ్యూల్ కూడా దుబాయ్ లోనే ప్లాన్ చేయగా కరోనా కారణంగా ఇప్పుడు హైదరాబాద్ లోని ఫిలిం సిటీలోకి మార్చారు.చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సెకండ్ షెడ్యూల్ ఉగాది రోజు స్టార్ట్ చేసారు.
అయితే ఇప్పుడు సర్కారు వారి పాటకు కొత్త టెన్షన్ పట్టుకుంది.షూటింగ్ ప్రారంభమయ్యి రెండు రోజులు కూడా అవ్వకుండానే అప్పుడే సెట్స్ నుండి సినిమా కు సంబంధించి ఫోటోలు బయటకు వచ్చాయి.

ఈ షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి ఏదో ఒక రూపంలో ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి.ఇప్పుడు కూడా ఒక పిక్ బయటకు వచ్చింది.అందులో మహేష్ బాబు మాస్క్ పెట్టుకుని, బ్లూ షర్ట్, బ్లూ ప్యాంటు వేసుకుని స్టైల్ గా నడుస్తున్న ఫోటో ఒకటి లీక్ అయ్యింది.ఇప్పుడు ఈ ఫోటో మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది.ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నాడు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు
.