మహేష్‌బాబు రికార్డ్‌ ఫేక్‌ అంటున్న ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌

మొన్న ఉగాదికి జెమిని టీవీలో ప్రసారం అయిన సరిలేరు నీకెవ్వరు చిత్రం రికార్డు స్థాయి టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది అంటూ మహేష్‌ అభిమానులు గొప్పగా ప్రకటించిన విషయం తెల్సిందే.మహేష్‌బాబు గత 15 ఏళ్లలో ఎవరు కూడా సాధించని రికార్డును దక్కించుకున్నాడు అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేశారు.

 Mahesh, Sarileru Nekevvaru, Trp Ratings, Temper , Ntr, Mahesh Babu, Temper Movie-TeluguStop.com

మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు మరోసారి సునామిలాంటి టీఆర్పీ రేటింగ్‌ దక్కించుకుని సినిమా హిట్‌ అంటూ నిరూపించుకుంది అంటున్నారు.

ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ అభిమానుల వాదన మరోలా ఉంది.

సరిలేరు నీకెవ్వరు ఆల్‌ టైం రికార్డు ఎలా అవుతుందని అంటున్నారు.ఎన్టీఆర్‌ నటించిన టెంపర్‌ చిత్రం అద్బుతమైన టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది.

ఇప్పటికి ఎప్పటికి ఆ సినిమానే తెలుగులో అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకున్న సినిమా అంటున్నారు.మహేష్‌బాబు ఫ్యాన్స్‌ అత్యుత్సాహంతో ఉరుకులు పరుగులు పెడుతూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

Telugu Mahesh, Mahesh Babu, Temper, Trp-Movie

ఎన్టీఆర్‌ టెంపర్‌ చిత్రం గతంలో 26 రేటింగ్‌ను దక్కించుకుంది.ఆ తర్వాత స్థానంలో శ్రీరామదాసు చిత్రం 24 రేటింగ్‌తో రెండవ స్థానంలో ఉంది.మగధీర కూడా 24 రేటింగ్‌ను దక్కించుకుంది.ఆ తర్వాత స్థానంలో సరిలేరు నీకెవ్వరు 23.4 రేటింగ్‌తో ఉందని దాన్ని నెం.1 అంటూ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube